Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు డ్రైవ్ చేస్తుంటే మాస్కు ధరించలేదని ఫైన్.. రూ.10 లక్షల పరిహారం కోరుతూ పిటిషన్

Webdunia
శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (12:45 IST)
న్యూఢిల్లీలో పోలీసులకు ఓ న్యాయవాది చుక్కలు చూపించాడు. కారులో ఒంటరిగా వెళుతున్న వ్యక్తికి మాస్కు ధరించలేదని ఢిల్లీ పోలీసులు అపరాధం వసూలు చేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ వ్యక్తి నేరుగా ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒంటరిగా కారులో వెళుతుంటే మాస్క్ ధరించలేదని ఫైన్ వేసి, మానసికంగా వేధించారని, అందువల్ల తనకు 10 లక్షల రూపాయల అపరాధం చెల్లించేలా ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారణకు సహేతుకంగా ఉండటంతో ఢిల్లీ హైకోర్టు సైతం విచారణకు స్వీకరిస్తున్నట్టు పేర్కొంది. 
 
మరిన్ని వివరాల్లోకి వెళితే, న్యూఢిల్లీలో ఓ న్యాయవాది కారులో ప్రయాణిస్తున్న వేళ పోలీసులు ఆపారు. మాస్క్ లేకుండా బహిరంగ ప్రదేశంలో కారు నడుపుతున్నాడని ఆరోపిస్తూ, జరిమానా విధించారు.  ఈ చర్యతో తన పరువు పోయిందని, తాను అన్ని నిబంధనలనూ పాటిస్తున్నానని చెబుతూ, కోర్టును ఆశ్రయించాడు.
 
తాను తన సొంత కారులో ఒక్కడినే ఉన్నానని, అటువంటి సమయాల్లో మాస్క్ అవసరం లేదని కేంద్ర మార్గదర్శకాల్లో స్పష్టంగా ఉందని పిటిషనులో పేర్కొన్నారు. ప్రజల మధ్యకు వెళితే, తాను మాస్క్ ధరిస్తానని, ఒంటరిగా ఉన్న సమయంలో అది అవసరం లేదని అన్నాడు.
 
తాను కరోనా నిబంధనలను అన్నిటినీ పాటిస్తున్నానని, అయినా తనను అన్యాయంగా పోలీసులు వేధించి, ఫైన్ కట్టించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చాడు. తనకు ఎంతో మానసిక ఒత్తిడి కలిగిందని, ఢిల్లీ పోలీసుల నుంచి తనకు రూ.10 లక్షలు పరిహారం ఇప్పించాలంటూ పేర్కొన్నారు.
 
పైగా, తాను ఒంటరిగా ఉన్న వేళ, మాస్క్ ధరించక పోవడం ఇతరులకు హాని కలిగించినట్టు కాదని స్పష్టం చేశాడు. ఈ కేసును నవంబర్ 18న విచారిస్తామని జస్టిస్ నవీన్ చావ్లాతో కూడిన సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments