Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యను చంపి.. శవం పక్కనే రాత్రంతా నిద్రపోయిన భర్త... ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (09:52 IST)
తాగిన మైకంలో భార్యను చంపేశాడు. అదీకూడా అత్తారింట్లోనే. మద్యంమత్తులో భార్యతో గొడవపడి ఆమెను హత్య చేశాడు. ఆ మత్తులోనే శవం పక్కనే రాత్రంతా పడుకున్నాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజ్‌కుమార్ (32) అనే వ్యక్తి బురారీలోని సంత్ నగర్‌లో ఉంటున్నాడు. గతంలో కోట్లాలోని ముబారక్‌పూర్‌లో కుమార్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేసేవాడు. అయితే, లాక్డౌన్ తర్వాత పనిలేకపోవడంతో అత్తారింటికి వెళ్లిపోయాడు. ఆరు నెలల పాటు భార్య, కొడుకుతో అక్కడే ఉన్నాడు. 
 
భార్య చిన్న కిరాణా షాపు నపుడుతుంటే... అతను ప్లంబర్‌గా పనిచేయసాగాడు. అయితే, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు జరుగుతుండేవి. మంగళవారం రాత్రి 11గంటల సమయంలో డిన్నర్ పూర్తి అయింది. ఓ అరగంట తర్వాత ఫుల్లుగా తాగాడని కుమార్‌తో గొడవపెట్టుకుంది.
 
ఆ గొడవలోనే హశికను గొంతు నొక్కి చంపేశాడు. తర్వాత శవం పక్కనే పడుకుని నిద్రపోయాడు. తెల్లవారుజామున 4గంటల 30నిమిషాలకు లేచి చూసేసరికి భార్య కదలకుండా పడి ఉంది. అంతే బ్యాగు సర్దుకుని నాంగ్లోయ్‌లోని సోదరి ఇంటికి పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments