Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్తి పంపకానికి తమ్ముడు నిరాకరణ... అన్న ఆత్మహత్య

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (09:22 IST)
తండ్రి సంపాదించిన ఆస్తిని పంచి ఇచ్చేందుకు తమ్ముడు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం బేగంపేటలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బేగంపేట వాస్తవ్యుడు కృష్ణారెడ్డి (48) అనే వ్యక్తి బతుకుదెరువు కోసం కృష్ణారెడ్డి ఏపీలోని గుంటూరు జిల్లా చేవెళ్లపురంలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. అతడి తమ్ముడు కొండల్‌రెడ్డి ఊర్లోనే ఉంటున్నాడు. 
 
తండ్రి నర్సింహారెడ్డి తాను కొన్న 10 ఎకరాల్లో రెండెకరాలను తన భార్య పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాడు. నర్సింహారెడ్డి మృతిచెందిన తర్వాత కొండల్‌రెడ్డి ఒక్కడే ఆ 8 ఎకరాల భూమిని తన పేరు మీద చేసుకోవడంతో వివాదం మొదలైంది. 
 
పలుమార్లు తనకు రావాల్సిన వాటా 4 ఎకరాలను తన పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయాలని కొండల్‌రెడ్డిని కృష్ణారెడ్డి కోరాడు. గ్రామపెద్దల ముందు అన్నకు రావాల్సిన వాటా ఇస్తానని చెప్పిన కొండల్‌రెడ్డి అనంతరం మొహం చాటేస్తుండటంతో కృష్ణారెడ్డి మనస్తాపానికి గురయ్యాడు. 
 
గురువారం ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కృష్ణారెడ్డి చావుకు తమ్ముడు కొండల్‌రెడ్డే కారణమని ఆరోపిస్తూ బంధువులు కొండల్‌రెడ్డి ఇంటి ఎదుట ఆందోళన చేశారు. తల్లిదండ్రులు మృతిచెందడంతో కృష్ణారెడ్డి ఇద్దరు కొడుకులు అనాథలుగా మారారని, ఇప్పటికైనా ఆస్తిని పిల్లల పేర్లపై రిజిస్ట్రేషన్‌ చేయించాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments