Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కర్ణాటకలో కళాకారిణి రౌద్రావతారం : పాత్రలో లీనమై హత్యాయత్నం!!

Advertiesment
కర్ణాటకలో కళాకారిణి రౌద్రావతారం : పాత్రలో లీనమై హత్యాయత్నం!!
, శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (07:56 IST)
కర్నాటక రాష్ట్రంలో ఓ కళాకారిణి రౌద్రావతారం ఎత్తింది. పాత్రలో లీనమై సహచర కళాకారుడుపై హత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన సంచలనం రేపింది. అదీకూడా... ఈ కళాకారిణి పరకాయ ప్రవేశం చేసి ఈ విధంగా హత్యాయత్నానికి పాల్పడటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నాటకలో మండ్య జిల్లాలోని నాల్వడి కృష్ణరాజ ఒడయార్‌ కళామందిరంలో ఈ నెల 4న ‘కౌండలీకన వధ’ అనే పౌరాణిక నాటకాన్ని కంతమంది కళాకారులు ప్రదర్శించారు. దీనిలో ద్రౌపది పాత్ర పోషించిన దొడ్డ శృతి నాటకం చివర్లో కాళికాదేవి అవతారమెత్తి త్రిశూలంతో రాక్షసుడు కౌండలికను సంహరించే సన్నివేశం ఉంది. 
 
అయితే, ఆఖరులో కౌండలికను ద్రౌపది కింద పడేసి త్రిశూలాన్ని అయన గుండెకు ఆనిస్తే నాటకం పూర్తవుతుంది. కానీ.. కౌండలీకను గట్టిగా తోసి కిందపడేసిన ద్రౌపది పాత్రధారి ఆవేశంతో బిగ్గరగా కేకలు వేస్తూ త్రిశూలంతో ఆయన్ను పొడిచేందుకు ముందుకురికింది. 
 
అయితే పరిస్థితిని గమనిస్తున్న సహకళాకారులు.. ఉపద్రవాన్ని ముందే గుర్తించి వేదికపైకి వెళ్లి ఆమెను బలవంతంగా అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది. శృతి మాట్లాడుతూ.. వేదికపై ఒక్కక్షణం ఏమైందో తనకు తెలియలేదని పేర్కొంది. ఉద్దేశ్యపూర్వకంగా ఇలా చేయలేదని, పాత్రలో లీనమైపోవడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేడు భారత్ బంద్ : పెట్రో బాదుడుకు నిరసనగా...