ఢిల్లీలో దారుణం : ఫ్లాట్‌లో జంట హత్యలు - విగతజీవులుగా తల్లీకొడుకు

ఠాగూర్
గురువారం, 3 జులై 2025 (11:13 IST)
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఫ్లాట్‌లో తల్లీ కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. మృతులను లజ్‌పత్ నగర్ పార్ట్‌లో ఉంటున్న రుచికా సేవాని (42), ఆమె కుమారుడు క్రిష్ (14)గా గుర్తించారు. గత రాత్రి ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
 
రుచికా భర్రత కుల్దీప్ సేవాని తన భార్యకు, కొడుక్కి పలుమార్లు ఫోన్ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో అనుమానంతో రాత్రి ఇంటికి చేరుకున్న ఆయనకు అపార్టుమెంట్ మెట్లపైనే ప్రవేశద్వారం వద్ద రక్తపు మరకలు కనిపించాయి. దీంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురై వెంటనే గత రాత్రి 9.43 గంటల సమయంలో పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించారు.
 
వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్ధలుకొట్టి లోపలికి ప్రవేశించి చూడగా తల్లీ కుమారుడు శవాలై కనిపించారు. పడక గదిలో రుచికా సేవాని మృతదేహం ఉండగా, వాష్ రూమ్‌లో ఆమె కుమారుడు క్రిష్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. ఇద్దరి శరీరాలపై లోతైన కత్తిపోట్లు ఉన్నాయని, అత్యంత దారుణంగా వారిని హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవిని క్షమాపణలు కోరిన వర్మ ... ఎందుకో తెలుసా?

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో మూవీకి చాలా అవార్డులు వస్తాయి - బీవీఎస్ రవి

Janhvi Swaroop: కౌశిక్ గోల్డ్, డైమండ్స్ ప్రచారకర్తగా జాన్వి స్వరూప్ ఘట్టమనేని

సంచలనంగా మారిన మన శంకరవర ప్రసాద్ గారు మీసాల పిల్ల సాంగ్

Mahesh Babu: మహేష్ బాబు .. బిజినెస్‌మ్యాన్ 4K ప్రింట్‌తో రీ-రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

హ్యుందాయ్ హోప్ ఫర్ క్యాన్సర్ ద్వారా క్యాన్సర్ నుంచి సంరక్షణలో ముందడుగు

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

తర్వాతి కథనం
Show comments