Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విద్యార్థులు - టీచర్ల మధ్య శృంగారం సహజమే... విద్యార్థికి లేడీ టీచర్ లైంగిక దాడి..

Advertiesment
romance

ఠాగూర్

, బుధవారం, 2 జులై 2025 (14:55 IST)
ముంబై మహానగరంలో ఓ విద్యార్థిని ఓ మహిళా టీచర్ లైంగికంగా వేధించారు. 11వ తరగతి విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థిపై టీచర్ లైంగిక వేధింపులకు పాల్పడింది. దీంతో ఆమెపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. టీచర్ ప్రవర్తనపై బాధిత విద్యార్థి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 
 
పోలీసుల వెల్లడించిన వివరాల మేరకు.. 2023లో పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా గ్రూపు డ్యాన్స్ కోసం సిద్ధం చేస్తున్న సమయంలో బాధిత విద్యార్థితో ఆ టీచర్ పరిచయం పెంచుకున్నట్టు సమాచారం. ఆ తర్వాత అతడిని ఆమె పలు ఫైవ్‌స్టార్ హోటళ్ళకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. 
 
తొలుత ఆ విద్యార్థి నిరాకరించినప్పటికీ మరో మహిళ సాయంతో ఆ బాలుడిని టీచర్ ఒప్పించినట్టు సమాచారం. టీచర్లు, విద్యార్థుల మధ్య ఇలాంటి సహజమేనని చెప్పి బాలుడిని ఒప్పించింది. దీంతో అతడు టీచర్‌ను కలిసేందుకు సమ్మతించినట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఓ మహిళపై కూడా కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. 
 
ఆ తర్వాత టీచర్.. ఆ విద్యార్థిని కారులో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లిందని పోలీసులు చెప్పారు. అతడితో మద్యం కూడా తాగించేదని పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ విద్యార్థి తీవ్ర ఆందోళనకు గురయ్యేవాడని, ఆందోళన తగ్గేందుకు టీచర్ మందులు కూడా ఇచ్చేదని పోలీసులు విచారణ వెల్లడైనట్టు సమాచారం. తమ కుమారుడి ప్రవర్తనలో మార్పు రావడాన్ని గ్రహించిన తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెల్లడైంది. అయితే, తొలుత దీనిపై ఫిర్యాదు చేయకూడదని నిర్ణయించుకున్నారు. కానీ, ఈ వేధింపులు అధికం కావడంతో ఫిర్యాదు చేయకతప్పలేదని తల్లిదండ్రులు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Rabies: తను రక్షించిన కుక్కపిల్ల కాటుకే గిలగిలలాడుతూ మృతి చెందిన గోల్డ్ మెడలిస్ట్ కబడ్డీ ఆటగాడు (video)