Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీని చితక్కొట్టిన పోలీస్ అధికారి

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (13:24 IST)
ముఖానికి మాస్క్ ధరించలేదని ఓ పోలీస్ కానిస్టేబుల్‌ను పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చితకబాదారు. ఈ ఘటన ఢిల్లీలోని ప్రేమ్‌ నగర్‌ ప్రాంతంలో జరిగింది. మాస్క్‌ విషయమై అధికారికి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన వాగ్వాదం ఈ దాడికి దారితీసింది. 
 
ఢిల్లీలోని ప్రేమ్‌నగర్‌ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. దేశరాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కరోనా వైరస్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న విషయం తెలిసిందే. దీంతో మాస్క్‌ ధరించడం తప్పనిసరి అని అక్కడి ప్రభుత్వం స్పష్టంచేసింది.
 
దుర్గాచౌక్‌ వద్ద జోగేంద్ర అనే కానిస్టేబుల్‌తోపాటు మరికొందరు పోలీసు, సీఆర్పీఎఫ్‌ జవాన్లు విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌ ప్రకాష్‌ మాస్క్‌ ధరించని జోగేంద్రను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్యా వాగ్వాదం జరిగింది.
 
ఆ సమయంలో ఎస్‌హెచ్‌ఓ తనను లాఠీతో తీవ్రంగా కొట్టినట్లు సదరు కానిస్టేబుల్‌ ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికాయి ఓ ఏసీపీని దర్యాప్తు అధికారిగా నియమించారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. 

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

ఓటు వేసేందుకు బయటికి రాని ప్రభాస్.. ట్రోల్స్ మొదలు..!

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments