Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా- 3బోగీలతో ప్రత్యేక రైలు.. ఎవరి కోసమంటే?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (12:59 IST)
కరోనా' వైరస్‌ నివారణ పనుల్లో వైద్యులు, నర్సులు, పోలీసులు, రైల్వే భద్రతా పోలీసులు సహా మొత్తం 16 శాఖల సిబ్బంది పాల్గొంటున్నారు. వీరి సౌకర్యార్ధం అరక్కోణం నుంచి జోలార్‌పేట వరకు బుధవారం నుంచి 3 బోగీలతో ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. అరక్కోణం నుంచి ఉదయం 6 గంటలకు బయల్దేరే రైలు 9 గంటకు జోలార్‌పేట చేరుకుంటుంది. 
 
అలాగే, సాయంత్రం 6 గంటలకు జోలార్‌పేట నుంచి బయల్దేరి రాత్రి 9 గంటలకు అరక్కోణం చేరుకుంటుంది. ఈ రైలు షోలింగర్‌, వాలాజా, కాట్పాడి, గుడియాత్తం, అంబూరు స్టేషన్లలో ఆగుతుందని, రైల్వే అధికారులు మంజూరు చేసిన పాస్‌లు పొందిన వారు ఈ రైలులో ఉచితంగా ప్రయాణించవచ్చని దక్షిణ రైల్వే తెలియజేసింది.
 
తమిళనాడులో ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు ఆ రాష్ట్ర సర్కారు వెల్లడించింది. కొవిడ్‌ 19 వ్యాప్తిని అరికట్టేందుకు ప్రస్తుతం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 30వరకు పొడిగిస్తున్నట్టు సీఎం పళనిస్వామి ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ, పంజాబ్‌, ఒడిశా, మహారాష్ట్ర, బెంగాల్‌ లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించగా.. ఈ జాబితాలో తాజాగా తమిళనాడు చేరింది. 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments