Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిజ్జా డెలివరీ బాయ్‌కి కరోనా ... 72 కుటుంబాల సభ్యులకు వణుకు

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (12:39 IST)
ఢిల్లీలో ఇంటింటికీ పిజ్జా డెలివరీ బాయ్‌కు కరోనా వైరస్ సోకింది. దీంతో అతను డెలివరీ చేసిన 72 కటుంబాలకు, అతనితో పాటు పనిచేసిన మిగిలిన బాయ్స్‌ను, పిజ్జా సెంటర్ స్టాఫ్‌ను అధికారులు క్వారంటైన్ చేశారు. ఈ ఘటనతో మాల్వియా నగర్ ప్రాంతంలో కలకలం రేగింది. ద‌క్షిణ ఢిల్లీలోని మాల్వియా న‌గ‌ర్‌ ప్రాంతంలో ప్ర‌ముఖ‌ పిజ్జా సంస్థ‌ ఓ రెస్టారెంట్ ను నిర్వహిస్తుండగా, ఓ యువకుడు అక్కడ డెలివ‌రీ బాయ్‌గా ప‌ని చేస్తున్నాడు.
 
డెలివరీ బాయ్ కరోనా లక్షణాలతో బాధపడుతూ ఉండటంతో, పరీక్షలు చేయించగా, అతనికి పాజిటివ్ వచ్చినట్టు బుధవారం నాడు తేలింది. అతను దగ్గు, జ్వరం, జలుబు ఉన్న సమయంలోనూ పిజ్జాలను డెలివరీ చేశాడని తెలుసుకున్న అధికారులు, అతన్ని ఆసుపత్రికి తరలించారు.
 
ఆపై అతనితో పాటు పనిచేసిన 16 మందిని, అతన్నుండి డెలివరీ అందుకున్న 72 కుటుంబాలను సెల్ఫ్ క్వారంటైన్ చేశారు. కాగా, డెలివరీ సమయంలో పిజ్జా బాయ్, ముఖానికి మాస్క్ వేసుకునే ఉన్నాడని, కాబట్టి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments