Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలి: మోదీకి స్వాతి లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయ్యింది. ఢిల్లీ మహిళలపై అకృత్యాలకు అడ్డాగా మారిన నేపథ్యంలో.. వయోబేధం లేకుండా చిన్నారులను చిదిమేస్తున్న కామా

Webdunia
ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (10:01 IST)
దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) సీరియస్ అయ్యింది. ఢిల్లీ మహిళలపై అకృత్యాలకు అడ్డాగా మారిన నేపథ్యంలో.. వయోబేధం లేకుండా చిన్నారులను చిదిమేస్తున్న కామాంధులను చంపేయాలని.. వారికి మరణ శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖలో డీసీడబ్ల్యూ ఛైర్ పర్సన్ స్వాతి మాలివల్ కోరారు.

మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా నెల రోజులపాటు సత్యాగ్రహం చేయనున్నట్టు స్వాతి ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
 
ఇప్పటికే ఎనిమిది నెలల చిన్నారిపై ఢిల్లీలో జరిగిన అకృత్యం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. ఈ నేపథ్యంలో ప్రధానికి లేఖ రాసిన స్వాతి..చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడేవారికి మరణశిక్ష విధించాలని.. అలాంటి విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.
 
కామాంధుడి అఘాయిత్యానికి గురైన చిన్నారి ఎయిమ్స్‌లో ప్రాణాలతో పోరాడుతోందని.. ప్రధాని దృష్టి అటు వైపు మళ్లించేందుకే ఈ లేఖను రాసినట్లు స్వాతి పేర్కొన్నారు. ఇంతకుముందు రెండేళ్లుగా ప్రధాని మోదీకి రాసిన లేఖల్లో ఒక్కదానికీ సమాధానం లేదని విమర్శించారు. మహిళలు అందరికీ మీరే దిక్కు.. వారికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మోదీపై వుందని లేఖలో స్వాతి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments