Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కన్నతల్లి పక్షవాతాన పడితే.. కుమారుడు ఏం చేశాడో తెలుసా? (video)

కన్నతల్లి పట్ల ఓ కిరాతక కుమారుడు అమానుషంగా ప్రవర్తించాడు. కన్నకొడుకును నవమాసాలు మోసి పెంచి.. పెద్ద చేసిన ఆ తల్లి పక్షవాతాన పడితే.. ఆ కుమారుడు చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో ఆ తల్లి ప్రాణాలు కోల్పో

Advertiesment
కన్నతల్లి పక్షవాతాన పడితే.. కుమారుడు ఏం చేశాడో తెలుసా? (video)
, శనివారం, 3 ఫిబ్రవరి 2018 (12:22 IST)
కన్నతల్లి పట్ల ఓ కిరాతక కుమారుడు అమానుషంగా ప్రవర్తించాడు. కన్నకొడుకును నవమాసాలు మోసి పెంచి.. పెద్ద చేసిన ఆ తల్లి పక్షవాతాన పడితే.. ఆ కుమారుడు చిత్రహింసలకు గురిచేశాడు. ఈ క్రమంలో ఆ తల్లి ప్రాణాలు కోల్పోయింది. 
 
ఈ ఘటన రాజస్థాన్‌లోని షాజ్‌హాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేసే నిందితుడు కన్నతల్లిని వృద్ధాప్యంలో కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిందిపోయి.. పక్షవాతాన పడిన 82 ఏళ్ల తల్లిని లేపి.. చిత్ర హింసలకు గురిచేశాడు. 
 
ఇలా చిత్ర హింసలకు గురైన ఆ వృద్ధురాలు మరణించింది. కన్నబిడ్డ కన్నతల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసురున్న పోలీసులు పరారీలో వున్న ఇంగ్లీష్ టీచర్‌ కోసం గాలిస్తున్నారు. తల్లిని ఇలా చిత్రహింసలకు గురిచేస్తున్న వీడియోను నిందితుడి మేనల్లుడు తీశాడని పోలీసులు తెలిపారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''దెయ్యం'' ఆ నటుడి దేహంలోకి ప్రవేశించిందా? (video)