Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒప్పుకో... లేదంటే ఫ్రెండ్స్‌ని పిలిచి గ్యాంగ్ రేప్ చేయిస్తా... యువతిపై అత్యాచారం

ఢిల్లీలో ఓ యువతిపై కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అత్యాచారం చేసేందుకు ప్రతిఘటిస్తున్న యువతిని సదరు కామాంధుడు తనతో సహకరిస్తే నా ఒక్కడితోనే పోతుంది... ప్రతిఘటిస్తే నా స్నేహితులందరినీ పిలిపించి గ్యాంగ్ రేప్ చేయిస్తానంటూ బెదిరించి

Webdunia
గురువారం, 14 సెప్టెంబరు 2017 (16:49 IST)
ఢిల్లీలో ఓ యువతిపై కామాంధుడు అత్యాచారం చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. అత్యాచారం చేసేందుకు ప్రతిఘటిస్తున్న యువతిని సదరు కామాంధుడు తనతో సహకరిస్తే నా ఒక్కడితోనే పోతుంది... ప్రతిఘటిస్తే నా స్నేహితులందరినీ పిలిపించి గ్యాంగ్ రేప్ చేయిస్తానంటూ బెదిరించి అఘాయిత్యం చేశాడు. వివరాల్లోకి వెళితే... జార్ఖండ్‌కు చెందిన 23 ఏళ్ల యువతి గత వారం ఉద్యోగ ప్రయత్నంలో భాగంగా తన సోదరుడి ఇంటికి వచ్చింది. 
 
ఉద్యోగం కోసం ఢిల్లీలోనూ ప్రయత్నించింది. కానీ ప్రయత్నం సఫలం కాకపోవడంతో తిరుగు ప్రయాణమైంది. తను లుధియానాకు వెళ్లాల్సిన రైలు ఢిల్లీలో వేకువ జామున 4 గంటలకు కావడంతో ఓ లాడ్జిలో బస చేసింది. స్టేషనుకు వెళ్లేందుకు లాడ్జి గదిని 2 గంటలకు ఖాళీ చేసి ఓ క్యాబ్‌ను మాట్లాడుకుంది. రైల్వే స్టేషనుకు వెళ్తూ డ్రైవరు ఆమెతో మాటలు కలిపాడు. చాలా మంచివాడిలా నటించాడు. ఆ తర్వాత ఆమె ఎక్కాల్సిన రైలు క్యాన్సిల్ అయిందని చెప్పాడు. 
 
అతడి మాటలు నమ్మిన ఆ యువతి, తనను బస్సు స్టేషనుకు తీసుకెళ్లాలని చెప్పింది. అలాగే అని చెప్పిన ఆ కామాంధుడు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటిస్తుండటంతో... తనకు సహకరిస్తే తనతో ఒక్కడితోనే పోతుందనీ, అలా కాదంటే తన స్నేహితులను పిలిపించి అందరం కలిసి గ్యాంగ్ రేప్ చేస్తామని హెచ్చరించాడు. అఘాయిత్యం చేసి ఆమెను పాత ఢిల్లీ రైల్వే స్టేషను సమీపంలో వదిలేసి వెళ్లిపోయాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని 14 రోజుల పోలీసు కస్టడీకి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం