Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టి దుస్తులు ధరించి అర్థనగ్న ప్రదర్శలు చేయడం వల్లే అత్యాచారాలు..

Webdunia
బుధవారం, 1 మే 2019 (13:39 IST)
పొట్టి దుస్తులు ధరించి అర్థనగ్న ప్రదర్శలు చేయడం వల్లే అత్యాచారాలు జరుగుతున్నాయని ఢిల్లీకి చెందిన ఓ మహిళ ఆరోపణలు చేసింది. ఇదే అంశంపై ఆమె ఓ వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేయగా అది వైరల్ అయింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, 'ఇప్పుడు రికార్డు చేయండి... ఈ అమ్మాయిలు షార్ట్‌లు, పొట్టి  దుస్తులు ధరించి అర్థనగ్నంగా ఉండటం వల్ల అత్యాచారాలకు గురవుతున్నారు' అని ఢిల్లీకి చెందిన మధ్యవయస్కురాలైన ఓ మహిళ ఆరోపించారు. 
 
ఢిల్లీలోని ఓ రెస్టారెంట్‍కు వచ్చిన మహిళ షార్టులు ధరించిన అమ్మాయిల గురించి ఈ వ్యాఖ్యలు చేశారు. యువతులే కురచ దుస్తులు ధరించి అత్యాచారాలకు అవకాశం కల్పిస్తున్నారని సదరు మహిళ చేసిన వ్యాఖ్యలతో అక్కడ ఉన్న అమ్మాయిలు వ్యతిరేకించారు. 
 
తమపై వ్యాఖ్యలు చేసిన మహిళ తమకు క్షమాపణలు చెప్పాలని డిమాండు చేస్తూ యువతులు మహిళతో వాగ్వాదానికి దిగారు. తాను క్షమాపణలు చెప్పేది లేదని మహిళ తెగేసి చెప్పారు. 'ఈ అమ్మాయిలు కురచ దుస్తులే వేసుకుంటున్నారు... వారిని వారి తల్లిదండ్రులే అదుపులో పెట్టాలి' అంటూ మహిళ కోరడం విశేషం. 
 
ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయింది. మహిళ వ్యాఖ్యలను అమ్మాయిలు వ్యతిరేకిస్తున్నారు. ఈ వీడియోపై ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్ మంది, ఫేస్‌బుక్‌లో 32 వేల మంది నెటిజన్లు తమ అభిప్రాయాలు పంచుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments