Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆర్ఆర్ఆర్‌లో నిత్యామీనన్ పాత్ర ఇదేనట

ఆర్ఆర్ఆర్‌లో నిత్యామీనన్ పాత్ర ఇదేనట
, సోమవారం, 29 ఏప్రియల్ 2019 (20:43 IST)
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు కొంత విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్ గాయం కారణంగా కొంత షూటింగ్ వాయిదా పడగా త్వరలోనే తిరిగి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త బయటకు వచ్చింది.
 
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్న రామ్ చరణ్‌కు జోడీగా అలియా భట్ నటిస్తుండగా, కొమురం భీమ్‌గా నటిస్తున్న ఎన్టీఆర్‌కు జోడీగా మొదట విదేశీ భామ డైసీని ఎంపిక చేశారు. కొన్ని కారణాల వలన డైసీ ఈ సినిమా నుంచి తప్పుకోగా ఆమె తరువాత ఆ పాత్ర కోసం రాజమౌళి అనేకమంది పేర్లను పరిశీలించారు.
 
అయితే నిత్యా మీనన్‌ను కూడా స్క్రీన్ టెస్ట్ చేసి ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇందులో నిత్యా మీనన్ చేస్తున్న పాత్ర గురించిన విషయంపై క్లారిటీ వచ్చింది. కొమురం భీమ్‌ను ఆరాధించే గిరిజన యువతి పాత్రలో నిత్యామీనన్ నటిస్తోందని వినికిడి. కథ ప్రకారం కొమురం భీమ్‌కు ముగ్గురు భార్యలు ఉండగా అందులో ఒకరిగా నిత్యా మీనన్ కనిపిస్తోందని సమాచారం. విదేశీ యువతి పాత్రలో ఎవరు నటిస్తున్నారు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే మిగిలి పోయింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలీ ‘యమలీల’ చిత్రానికి పాతికేళ్లు..!