Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ : ఫిబ్రవరి 5న పోలింగ్

ఠాగూర్
మంగళవారం, 7 జనవరి 2025 (16:39 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం నోటిఫికేషన్ జారీచేసింది. జనవరి పదో తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి ఐదో తేదీన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిర్వహించి, ఎనిమిదో తేదీన ఎన్నికల ఫలితాలను వెల్లడించనున్నారు. 
 
మొత్తం 70 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం నోటిఫికేషన్ జనవరి 10వ తేదీన విడుదల అవుతుంది. నామినేషన్లు సమర్పణకు జనవరి 17వ తేదీన చివరి తేదీ. నామినేషన్ల పరిశీలనకు జనవరి 18వ తేదీన ప్రారంభంకానుంది. జనవరి 20వ తేదీన నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. 
 
కాగా, ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 2.08 లక్షల మంది తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఈ ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కోసం 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌లను అందుబాటులో ఉంచనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. 85 యేళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రింకర్ సాయి తో ఇండస్ట్రీలో నాకో స్థానం కల్పించారు - హీరో ధర్మ

అడివి శేష్‌ G2 లో నటించడం ఆనందంగా, సవాలుగా వుందంటున్న వామికా గబ్బి

Kanguva: ఆస్కార్ రేసులో కంగువ.. సూర్య సినిమాపై మళ్లీ ట్రోల్స్

1000 వర్డ్స్ చిత్రం చూశాక కన్నీళ్లు వచ్చాయి :రేణూ దేశాయ్

రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు వేయొద్దు : రజనీకాంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

రోగనిరోధక శక్తి పెంచే ఆహారం ఇదే

గరం మసాలా ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

acidity అసిడిటీని తగ్గించే కొత్తిమీర రసం

తర్వాతి కథనం
Show comments