తీవ్ర తుపానుగా షహీన్.. 12 కిలోమీటర్ల వేగంతో కదిలింది..

Webdunia
శనివారం, 2 అక్టోబరు 2021 (09:59 IST)
అరేబియా సముద్రం మధ్యలో ఏర్పడిన షహీన్‌ తుపాను తీవ్ర తుపానుగా మారిందని భారత వాతావరణ శాఖ విభాగం (ఐఎండి) శుక్రవారం పేర్కొంది. అంతకు ముందు ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలింది.

సాయంత్రం 5.30 గంటల సమయానికి అరేబియా సముద్రం వాయువ్య, ఈశాన్య ప్రాంతం మధ్య కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. తదుపరి 12 గంటల్లో తుపాను మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని, 36 గంటల్లో మాక్రాన్‌ తీరం వెంబడి పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతుందని, ఆ తరువాత పశ్చిమ-నైరుతి వైపుగా తిరుగుతుందని తెలిపింది. 
 
అనంతరం ఒమన్‌ తీరం వైపుగా కదులుతూ క్రమంగా బలహీనపడుతుందని ఐఎండి వెల్లడించింది. గులాబ్‌ తుపాను ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా తీరం దాటిన వారం రోజుల తర్వాత ఈ షహీన్‌ తుపాను భారతదేశ తీరానికి దూరంగా వెళుతోంది. మత్స్యకారులు శనివారం వరకు ఆరేబియా సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఐఎండి హెచ్చరించింది. 
 
ఇప్పటికే వెళ్లిన వారెవరైనా ఉంటే వెంటనే వెనక్కు వచ్చేయాలని సూచించింది. షహీన్‌ ప్రభావంతో ఆదివారం వరకు గుజరాత్‌, బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, సిక్కింలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సోమవారం వరకు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

మగవాళ్లకు కూడా జీవితంలో ఒక్కసారైనా పీరియడ్స్ రావాలి... రష్మిక మందన్నా

పెళ్లికి కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది... కాజోల్

తోట తరణి సృజనాత్మక యువరతరానికి ఆదర్శం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments