Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ - రేపే నైరుతి ఆగమనం

Webdunia
గురువారం, 8 జూన్ 2023 (08:17 IST)
దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దేశంలోకి నైరుతి రుతుపవనాలు శుక్రవారం ప్రవేశిస్తాయని వెల్లడించింది. గత కొన్ని రోజులుగా దోబూచులాడుతూ ఇబ్బందులు పెట్టిన నైరుతి రుతపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయని, శుక్రవారం సాయంత్రానికల్లా ఇవి కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. గత యేడాదితో పోల్చితే ఈసారి రుతపవనాల రాకలో వారం రోజుల పాటు జాప్యం జరిగింది. 
 
ఇక తెలంగాణలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా ఓ మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. బుధవారం నాడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో అత్యధికంగా 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వికారాబాద్‌ జిల్లాలో బంట్వారంలో 5.1, నారాయణపేట్‌ జిల్లా దామరగిద్దలో 3.9 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది. 
 
మరోవైపు కరీంనగర్ జిల్లాలో గరిష్టంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్‌లో అత్యధికంగా 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సమంత ఆ దర్శకుడుతో ప్రేమలో ఉందా? హీరోయిన్ మేనేజరు ఏమంటున్నారు?

Karate Kid: అజయ్ దేవ్‌గన్- యుగ్ దేవ్‌గన్ కలసి ‘కరాటే కిడ్: లెజెండ్స్’ హిందీ ట్రైలర్ విడుదల!

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments