కాంగ్రెస్ చీఫ్ పదవి నుంచి తప్పుకున్న సోనియా గాంధీ..

Webdunia
సోమవారం, 24 ఆగస్టు 2020 (12:42 IST)
కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పుకునేందుకు సోనియా గాంధీ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి క్లారిటీ ఇచ్చారు. పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను మొదలుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌కు సోనియాగాంధీకి సూచించారు.

మరోవైపు సోనియాగాంధీని కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కోరారు. పార్టీకి చెందిన 23 మంది లేఖ రాయడం క్రూరమైన చర్య అని మరో మాజీ కేంద్రమంత్రి ఆంటోనీ అన్నారు.
 
మరోవైపు కాంగ్రెస్‌లో సమూల మార్పులు చేయాలని కోరుతూ 23 మంది నేతలు పార్టీ నాయకత్వానికి లేఖ రాయడంపై రాహుల్ గాంధీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అలాంటి లేఖ రాయడానికి ఇది సరైన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అంతకుముందు శశి థరూర్, మనీష్ తివారీ, పలువురు కేంద్ర మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు సహా 23 మంది పార్టీలో మార్పులు చేయాలని పార్టీ నాయకత్వానికి లేఖ రాయడం కాంగ్రెస్‌లో కల్లోలం సృష్టించింది. దీంతో అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని సోనియాగాంధీ నిర్ణయించుకున్నారు.
 
కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా తన రాజీనామా చేస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు.
 
సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్‌ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ ప్రధాని మన్మోహన్‌ పేరును ప్రతిపాదించారు. కాగా, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఏకే అంటోని సోనియానే అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9- ప్రియాశెట్టి అవుట్

Chandrabose: చంద్రబోస్ పాట రక్తికట్టించారు, నా కళ్ళు చమర్చాయి : ఆర్.నారాయణమూర్తి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సత్యం మాట్లాడారు : ఆర్. నారాయణ మూర్తి

OG: హంగ్రీ చీటా పాటపాడిన సింగర్ ఆర్.ఆర్ ధృవన్ కు పవన్ అభినందనలు

Kiran: మళ్లీశ్వరి, వెంకీ, రెడీ చిత్రాల్లా K-ర్యాంప్ చిత్రాన్ని చూడాలని అనుకుంటారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

Alarm: మహిళలూ.. అలారం మోత అంత మంచిది కాదండోయ్.. గుండెకు, మెదడుకు..?

కిడ్నీలను పాడు చేసే పదార్థాలు

తర్వాతి కథనం
Show comments