Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ కోసం ఎంత పనిచేశాడు.. సరిహద్దు దాటి పెళ్లి చేసుకున్నాడు..

Webdunia
మంగళవారం, 29 జూన్ 2021 (10:08 IST)
ప్రేమ కోసం ఏమైనా చేసే యువకులు ఏమైనా చేస్తారనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా ఓ యువకుడు ప్రేమించిన యువతి కోసం సరిహద్దు దాటాడు. పొరుగు దేశం యువతిని పెళ్ళాడి స్వదేశం వస్తుండగా అధికారులు పట్టుకున్నారు. 
 
ఈ ఘటన పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బెంగాల్‌లోని నదియా జిల్లా బల్లావ్ పూర్ చెందిన జైకాంతో చంద్రరాయ్ (24) అనే యువకుడికి బంగ్లాదేశ్ కు చెందిన పరిణీతి (18) అనే యువతితో ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
 
ఈ నేపథ్యంలోనే ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు అక్రమ మార్గంలో మార్చి 8 తేదీన చంద్రరాయ్ బంగ్లాదేశ్ వెళ్ళాడు. మార్చి 10 తేదీన పరిణీతిని పెళ్లి చేసుకున్నాడు. జూన్ 25 తేదీ వరకు అక్కడే ఉన్నాడు. 
 
జూన్ 26 తేదీ భార్య పరిణీతితో కలిసి బోర్డర్ దాటే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో వారిని బీఎస్ఎఫ్ అధికారులు పట్టుకున్నారు. ఇద్దరినీ విచారించడంతో పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు గట్టిగా నిలదీశారు. దీంతో చంద్రరాయ్ జరిగిన విషయం తెలిపాడు.
 
ఇక సరిహద్దు దాటించేందుకు ఓ వ్యక్తి తమ వద్ద 10000 బంగ్లాదేశీ టకాలు తీసుకున్నాడని తెలిపారు. కాగా వీరిని అదుపులోకి తీసుకున్న బీఎస్ఎఫ్ అధికారులు.. తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments