దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులో మరింతగా తగ్గాయి. దేశంలో 102 రోజుల తర్వాత కొత్త కరోనా కేసుల సంఖ్య 40 వేల కన్నా తక్కువగా నమోదైంది. గత 24 గంటల్లో 37,566 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఆ ప్రకారంగా 24 గంటల్లో 56,994 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,03,16,897కు చేరింది. ఇక మరణాల విషయానికొస్తే, సోమవారం 907 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.
దీంతో మృతుల సంఖ్య మొత్తం 3,97,637కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 2,93,66,601 మంది కోలుకున్నారు. 5,52,659 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో రికవరీ రేటు 96.87 శాతంగా ఉంది.