Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వచ్చినా మారరా..? ఆవులకు అరటిపండులో విషం పెట్టి చంపేశారు..!

Webdunia
సోమవారం, 20 జులై 2020 (13:30 IST)
కరోనా లాంటి వ్యాధులు వస్తున్నా మానవ వేషంలో వున్న మృగాలు అకృత్యాలకు పాల్పడుతూనే వున్నారు. మొన్నటికి మొన్న ఏనుగుకు పటాస్‌లతో చంపేసిన ఘటన మరవకముందే.. నేడు ఆవులకు విషం పెట్టి చంపేశారు. అదీ అరటి పండ్లలో విషం పెట్టి.. గోవులను హతమార్చారు. ఇలాంటి ఘటనలను చూస్తుంటే మనుషుల్లో మానవత్వం కరువైనట్టు కనిపిస్తోంది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో కాఫీ తోటలోకి ఆవులు చొరబడుతున్నాయన్న కారణంతో 20 ఆవులకు విషం పెట్టారు. దాంతో ఆవులు అక్కడే మృతి చెందాయి. కొడగు జిల్లాలోని ఐగూరు ఎస్టేట్‌లో జరిగిన ఈ దారుణంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్టేట్ సమీప గ్రామాల్లోని ఆవులు మేత మేస్తూ ఎస్టేట్ వరకు వచ్చేవి. దాంతో కాఫీతోటలో దూరి ఆకులను తింటాయని మేనేజర్, సిబ్బంది ఆవులకు అరటిపళ్ళలో విషం పెట్టి తినిపించేవారు. 
 
మృతిచెందిన తర్వాత ఆవుల మృతదేహాలను ఎస్టేట్‌లోనే పెద్ద గొయ్యి తవ్వి ఆవులను అందులో పూడ్చి పెడుతూ వచ్చారు. ఆలా ఇప్పటివరకు మొత్తం 20 ఆవులను చంపి పూడ్చిపెట్టారు. ఆవులు మాయమౌతుండటంతో గ్రామస్థులు ఎస్టేట్ వద్ద గాలిస్తుండగా కళేబరాలు కనిపించాయి. దాంతో విషయం బయట పడింది. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అలనాటి అందాల తార బి.సరోజా దేవి ఇకలేరు... చంద్రబాబు - పవన్ నివాళలు

Vishal: కార్తీ, జీవా ముఖ్య అతిథులుగా విశాల్ 35వ చిత్రం చెన్నైలో పూజా కార్యక్రమాలు

బి.సరోజాదేవి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్, బాలక్రిష్ణ

దివికేగిన అలనాటి నటి సరోజా దేవి: ఏకంగా 180 చిత్రాలు నటించారు.. తెలుగులో ఎన్ని సినిమాలు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments