Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోదరి చితిపై దూకిన యువకుడు - గాల్లో కలిసిపోయిన ప్రాణాలు

Webdunia
మంగళవారం, 14 జూన్ 2022 (12:01 IST)
వరుసకు సోదరి అయిన యువతి చితిపై దూకి ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడుని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాగర్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సాగరి జిల్లాలోని బహెరియా పోలీస్‌ స్టేషన్‌ పరిధి మఝ్‌గువా గ్రామంలో 21 ఏళ్ల యువతి పొలం నుంచి కూరగాయలు తెచ్చుకునేందుకు గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లింది. అయితే, ఆమె ఎంతసేపైనా తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ పొలంలోకి వెళ్లారు. 
 
అక్కడ పొలం బావిలో పడిపోయి ఉంటుందేమో అన్న అనుమానంతో చూడగా అందులో ఆమె మృతదేహం కనిపించింది. ఈ విషయాన్ని వారు పోలీసులకు తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆమెకు వరుసకు సోదరుడయ్యే కరణ్‌(18) 430 కి.మీ. దూరంలో ఉండే ధర్ నుంచి మోటారు బైకుపై గ్రామానికి చేరుకున్నాడు. 
 
శుక్రవారం సాయంత్రం సోదరి అంత్యక్రియలు జరుగుతుండగా పట్టరాని దుఃఖంతో ఒక్కసారిగా చితిమంటల్లోకి దూకాడు. దీన్ని గమనించిన బంధువులు అతణ్ని మంటల్లోంచి బయటకు లాగారు. అప్పటికే అతడికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి దారిలోనే చనిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments