Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోరలు చాచిన కరోనా వైరస్, హోలీ వేడుకలకు మోడీ దూరం

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (12:58 IST)
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కరోనా వైరస్ కేసుల నానాటికీ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో కరోనా వైరస్ సోకినట్టు అనుమానిస్తున్న వారి సంఖ్యతో నిండిపోయింది. దీంతో దేశ ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు వీలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. 
 
ఈ నేపథ్యంలో హోలీ వేడుకలకు దూరంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని మోడీ ట్విట్టర్‌లో తెలిపారు. 'కరోనా వైరస్ అయిన కోవిడ్-19 దృష్ట్యా జనాలు ఒకే చోట గూమికూడి ఉండొద్దని ప్రపంచ వ్యాప్త నిపుణులు సూచిస్తున్నారు. దీంతో ఈ యేడాది హోలీ వేడుకలకు దూరంగా ఉంటాను' అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, కరోనా నియంత్రణ కోసం కరచాలనం, కౌగిలింతలు వంటివి మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. జనాలతో సన్నిహితంగా తిరగవద్దని చెబుతున్నారు. సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌తో పాటు జనసంచారం అధికంగా ఉండే చోట్ల జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments