Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో విజృంభిస్తోన్న కరోనా.. కర్ణాటకలో ఒక్కరోజే 141 మంది మృతి

Webdunia
శనివారం, 29 ఆగస్టు 2020 (07:52 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో కరోనా మరణమృదంగం మోగిస్తోంది. ఒక్క రోజే 141 మంది కరోనాతో మరణించారు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో మరణాల సంఖ్య 5,232కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,386 పాజిటివ్ కేసులు నమోదు కాగా, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,09,792కు చేరుకున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. 
 
తాజాగా నమోదైన కేసుల్లో బెంగళూరులో 3,357 పాజిటివ్‌ కేసులు అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు బెంగళూరులో 1,18,728కి చేరుకోగా, 35,989 కేసులు యాక్టివ్‌లో ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తంగా 2,19,554 మంది కోలుకోగా, 84,987 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక 747 మంది ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.
 
మరోవైపు దేశంలో ఒకే రోజులో 77,266 కోవిడ్‌ కేసులు యాక్టివ్‌ కేసులు నమోదైనాయి. దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. శుక్రవారం తాజాగా మరో 77,266 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 33,87,500కు చేరుకుంది. గత 24 గంటల్లో 60,177 మంది కోలుకోగా 1,057 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 61,529కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments