Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిఫ్ట్‌ బటన్‌ వల్ల కరోనా.. అపార్ట్‌మెంట్‌లో 2 వారాల్లో 20మందికి కరోనా

Advertiesment
Coronavirus
ఖమ్మం బైపాస్ రోడ్డులో గల ఓ అపార్ట్‌మెంట్‌లో రెండు వారాల్లో 20మందికి కరోనా సోకింది. వీరిలో ఓ వ్యక్తి హైదరాబాదులో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. కానీ  గ్రౌండ్‌ ఫ్లోర్‌‌లో ఏ ఒక్కరికీ కరోనా సోకలేదు. దీంతో లిఫ్ట్‌ బటన్‌ వల్లే కరోనా వ్యాపించినట్టు నిర్ధారించారు అధికారులు. అలాగే అదే ఖమ్మం జిల్లాలో కరోనా వచ్చిందన్న అనుమానంతో ఇళ్ళలోకి వెళ్లి మరి గ్రామస్తులు దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
కరోనా లేదని చెప్పినా వినకుండా మహిళలు పిల్లలపై కర్రలతో దాడి చేసినట్టు తెలుస్తోంది. గాయపడ్డ మహిళల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ గ్రామానికి పూజ చేసేందుకు కరోనా భయంతో పురోహితుడు రాలేదు. అయితే అలా రాకపోవడానికి వీరే కారణం అని కరోనా అనుమానం ఉన్న కుటుంబాల మీద దాడికి తెగబడ్డారు గ్రామస్తులు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నీట్, జేఈఈ పరీక్షలు.. ఆందోళనకు దిగిన విపక్షాలు.. సోనూ సపోర్ట్