తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకు పెరిగి పోతున్నది. నిన్న రాత్రి 8 గంటల వరకు కొత్తగా 2795 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,14,483కి చేరింది. మృతుల సంఖ్య 796కి పెరిగింది.
మరోవైపు నిన్న 872 మంది కోలుకోగా, ఇప్పటి వరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 86,095కి చేరింది. ప్రస్తుతం 27,600 మంది వివిధ కోవిడ్ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో 19,113 మంది ఉన్నట్లు వైద్య రోగ్య శాఖ వెల్లడించింది.
తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.68 శాతంగా ఉందని వైద్య రోగ్య శాఖ తెలిపింది. దీంతో కోలుకున్నవారి రేటు 75.2 శాతానికి చేరుకుంది. గత 24 గంటల్లో 30,772 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని ఆరోగ్య శాఖ తెలిపింది.
జీహెచ్ఎంసీలో మాత్రం 449, కరీంనగర్ 136, మహబూబాబాద్ 102, మంచిర్యాల 106, మేడ్చల్ 113, నల్గొండ 164, నిజామాబాద్ 112, రంగారెడ్డి 268, సిద్దిపేట 113, వరంగల్ అర్బన్ 131 కేసులు నమోదు కాగా ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో 20,866 మంది ఉన్నట్లు వైద్య శాఖ వెల్లడించింది.