Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యముడికి లేఖ రాసిన తమిళ పోలీసులు.. అలాంటి మరణమే కావాలని..?

Advertiesment
Tamil Nadu
చైనాలోని వుహాన్‌ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు చుక్కలు చూపిస్తోంది. కరోనా కారణంగా గత కొద్ది రోజులుగా 60వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ మహమ్మారిపై పోరులో ప్రజలను రక్షించేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న వారిలో డాక్టర్లు, పోలీసులు ముందు ఉన్నారు.
 
విధి నిర్వహణలో పోలీసులు కరోనాకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. తమను జీవితకాలాన్ని కాపాడాలని ఏకంగా యముడికి లేఖ రాసారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
'మేము ఎన్ని కష్టాలు అనుభవించినా.. ప్రజల ప్రాణాలు కాపాడటమే మా అంతిమ లక్ష్యం. కాబట్టి మా జీవిత కాలాన్ని దయాగుణంతో పొడిగించాలని మిమ్మల్ని కోరుతున్నాం. ఈ దేశానికి ఉపయోగపడే మరణం మాకు ఉందని భరోసా ఇవ్వండి. అలాంటి మరణమే మాకు కావాలి. ఈ లేఖ తరువాత పోలీసుల మరణాలపై దయ చూపిస్తారని నమ్ముతున్నాం. ' అని లేఖలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కరోనావైరస్, ఒక్క రోజులో అత్యధిక కేసులు నమోదు