Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కరోనా కొత్త రికార్డు.. మహారాష్ట్రలో డేంజర్ బెల్స్

Webdunia
గురువారం, 25 మార్చి 2021 (10:49 IST)
దేశంలో కరోనా కేసులు రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తున్నాయి. ప్రతీ రోజూ పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,65,021 మందికి వైద్యపరీక్షలు నిర్వహించగా...53,476 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇక కరోనా మరణాలు కూడా 24 గంటల వ్యవధిలో 251 నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు 1,17,87,534 కేసులు నమోదయ్యాయి. 
 
ఇందులో 1,12,31,650 మంది కోలుకొని డిశ్చార్జి కాగా, 3,95,192 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అలాగే ఇప్పటివరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 1,60,692కు చేరింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో 26,490 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అయితే, డిశ్చార్జ్ కేసుల కంటే, పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
 
మరోవైపు మహారాష్ట్రలో కరోనా మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రతి రోజూ దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికిపైగా ఆ ఒక్క రాష్ట్రం నుంచే వస్తుండటం గమనార్హం. ఇలానే కొనసాగితే ఏప్రిల్ 4వ తేదీ వరకూ మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3 లక్షలు దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు. 
 
అత్యధికంగా పుణె జిల్లాలో (61,125), తర్వాత నాగ్‌పూర్ (47,707), ముంబై (32,927)లలో అధిక కేసులు ఉన్నాయి. వచ్చే 11 రోజుల్లో మరణాల సంఖ్య కూడా 64 వేలు దాటనుందని అంచనా. ప్రస్తతం ప్రతి వారం ఇన్ఫెక్షన్ల సంఖ్య 1 శాతం మేర పెరుగుతోంది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments