Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్రాసు హైకోర్టులో ముగ్గురు జడ్జీలకు కరోనా!

Webdunia
ఆదివారం, 7 జూన్ 2020 (10:04 IST)
తమిళనాడు ను వణికిస్తున్న కరోనా మద్రాస్ హైకోర్టు తలుపునూ తట్టింది. మద్రాసు హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా సోకింది. దీంతో హైకోర్టును మూసివేశారు.

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కేసుల విచారణను చేసేందుకు ప్రత్యేక బెంచ్‌ లను ఏర్పాటు చేశారు. కాగా, లాక్‌ డౌన్‌ సమయంలో కోర్టును మూసివేసిన అనంతరం జూన్‌ 1 నుండి కోర్టులో విచారణలు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ముగ్గురు జడ్జీలకు కరోనా సోకడంతో.. వారికి సన్నిహితంగా ఉన్న వారికి కూడా వైద్యులు పరీక్షలు నిర్వహించారు.

హైకోర్టు న్యాయమూర్తి, ఇతర ఉన్నతాధికారులు, న్యాయమూర్తులతో కలిసి సమావేశమై, హైకోర్టుకు తాళం వేయాలని నిర్ణయించారు. ఆ వెంటనే న్యాయవాదులు, సిబ్బంది ఎవరూ రావద్దన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అత్యవసర కేసుల నిమిత్తం ఓ ప్రత్యేక బెంచ్‌ ని ఏర్పాటు చేసి, వీడియో కాన్ఫరెస్స్‌ ద్వారా విచారణలు చేపట్టాలని చీఫ్‌ జస్టిస్‌ ఆదేశించారు.

కాగా, స్థలాన్ని హైకోర్టు నిమిత్తం అప్పగించిన యజమాని విధించిన నిబంధన నిమిత్తం మద్రాస్‌ హైకోర్టుకు ప్రతి ఏడాది ఒక్కరోజు మాత్రం మూసివేస్తారు. వేసవి సెలవుల్లోనూ స్పెషల్‌ బెంచ్‌ లను ఏర్పాటు చేసి, విచారణలు జరుపుతుంటారు. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రత్యేక బెంచ్‌ లు ఏర్పాటవుతూ ఉంటాయి.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments