Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వైరస్ ఎఫెక్ట్, మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం, 800 మంది ఔట్

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (17:12 IST)
కరోనా వైరస్ మహమ్మారి తన ప్రతాపాన్ని క్రమంగా ఉద్యోగాలపైన కూడా చూపిస్తోంది. ఈ వైరస్ కారణంగా ప్రాజెక్టులు ఎక్కడికక్కడే ఆగిపోవడంతో కొన్ని కంపెనీలు భారీ నష్టాలతో విలవిలలాడిపోతున్నాయి. తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. ఉద్యోగుల జీతభత్యాలు చెల్లించలేక అవస్థలు పడుతున్నాయి. 
 
తాజాగా గుర్‌గ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న అమెరికా ఆధారిత కంపెనీ కనీసం 800 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్లు సమాచారం. గుర్ గ్రామ్ కేంద్రానికి అనుబంధంగా పనిచేస్తున్న మరో కంపెనీ పుణెలో వుంది. ఇక్కడ కూడా కొందరు ఉద్యోగులను తొలగించినట్లు చెపుతున్నారు.

ఎలాంటి కారణంగా చెప్పకుండానే సదరు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ-మెయిల్ ద్వారా... కాంట్రాక్టు పత్రంలో మీరు అంగీకరించినట్లుగానే కొన్ని అసాధారణ పరిస్థితుల వల్ల మిమ్మల్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం అంటూ క్లుప్తంగా సందేశాలను పంపినట్లు సదరు కంపెనీలు పని చేస్తున్న ఉద్యోగులు చెపుతున్నారు.
 
ఇలా ఉద్యోగాలు పోయినవారిలో 10 సంవత్సరాల అనుభవం వున్నవారు కూడా వుండటం గమనార్హం. కాగా దీనిపై కంపెనీ వైస్ ప్రెసిడెంట్ స్పందన కోరితే ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించినట్లు తెలిసింది. మరి ఈ లాక్ డౌన్ మరికొన్నాళ్లు కొనసాగితే ఎంతమంది ఉద్యోగాలకు ఎసరు పడుతుందో ఏమో?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Thug Life: మణిరత్నం, కమల్ హాసన్ థగ్ లైఫ్ తాజా అప్ డేట్

Ambedkar: అగ్రహారంలో అంబేద్కర్ సినిమా ఫస్ట్ లుక్

బుట్టబొమ్మకు తెలుగులో తగ్గిన అవకాశాలు.. బాలీవుడ్‌లో ఛాన్సులు...

పుష్పక విమానం టాకీ అయితే అది సారంగపాణి జాతకం : వెన్నెల కిషోర్

8కె. ఫార్మెట్ లో ఎన్.టి.ఆర్., రాజమౌళి సినిమా యమదొంగ రిరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

తర్వాతి కథనం
Show comments