Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్పత్రిలో నర్సు.. బయట బిడ్డ.. యడ్డీని కదిలించిన వీడియో

Webdunia
గురువారం, 9 ఏప్రియల్ 2020 (19:40 IST)
కరోనాతో ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దేశంలోనూ కరోనా కారణంగా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కరోనాపై పోరాటం చేసేందుకు కేంద్రం ఇప్పటికే లాక్ డౌన్ విధించిన తరుణంలో.. ప్రజలు ఇళ్లకే పరిమితమైయ్యారు. కానీ కరోనా మాత్రం ప్రజలను వదిలిపెట్టట్లేదు. అయితే వైద్యవృత్తిలో ఉన్న ఎందరో డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రేయింబవళ్లు కష్టపడుతూ.. వీరికి వైద్యం అందిస్తున్నారు.
 
తమ ఇళ్లకు కూడా వెళ్లకుండా, తమ కుటుంబసభ్యులను కలవకుండా వాళ్లు కరోనా రోగులకు సేవలు అందిస్తున్నారు. అలా కరోనా వైరస్ కారణంగా దూరమైన ఓ తల్లీకూతుళ్లకు సంబంధించి ఓ చిన్న వీడియో కర్ణాటక సీఎం యడ్యూరప్పను కదిలించింది. ఎంతలా అంటే ఆయన స్వయంగా ఆ నర్సుకి ఫోన్ ధైర్యం కూడా చెప్పేంతగా ఆ వీడియో ప్రభావం చూపింది.
 
బెళగావి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పని చేస్తున్న సుగంధ అనే నర్సులు గత 15 రోజులుగా తన కుటుంబానికి దూరంగా ఉంటూ ఆస్పత్రిలో రోగులకు వైద్యం అందిస్తుంది. అయితే తల్లి కోసం ఏడుస్తున్న చిన్నారి కూతురిని తీసుకొని ఆమె భర్త ఆస్పత్రి వద్దకు వచ్చాడు. కానీ, దగ్గరకు వెళ్తే ఎక్కడ కరోనా సోకుతుందనే భయంతో తన కూతురికి ఆమె చాలా దూరంలో నిలుచుంది. 
 
తల్లి కోసం ఏడుస్తున్న కూతురిని చూసి సుగంధతో పాటు అక్కడ ఉన్నవారందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత తన కూతురికి బై చెప్పి సుగంధ అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. ఆ వీడియోని టీవీలో చూసిన సీఎం యడ్యూరప్ప ఆ నర్సుకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments