Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా థ‌ర్డ్ వేవ్ మొదలైంది... జనవరి-ఏప్రిల్ మధ్య ఉధృతి

Webdunia
శుక్రవారం, 22 అక్టోబరు 2021 (15:03 IST)
క‌రోనా ధ‌ర్డ్ వేవ్... మూడో ముప్పు మొద‌లైంద‌ని శాస్ర‌వేత్త‌లు ప్ర‌కటించారు. జ‌న‌వ‌రి నుంచి దీని ప్ర‌భావం క‌నిపిస్తూ, ఏప్రిల్ కి ఉగ్ర‌రూపం దాలుస్తుంద‌ని చెపుతున్నారు. అక్టోబర్ నెల నుంచి క్రమంగా కేసులు పెరిగి, 2022 జనవరి - ఏప్రిల్ మధ్య కట్టడి చేయలేనంత తీవ్ర స్థాయికి కరోనా చేరే అవకాశం ఉందని ఎయిమ్స్ డైరెక్టర్ అంచనా వేశారు. దీంతో ఖచ్చితంగా ప్రజలు సూచనలు పాటించాలని ఎయిమ్స్ ఆరోగ్య గణాంక నిపుణులు హెచ్చరించారు. 

 
టూరిస్ట్‌ల సంఖ్య పెరగడం, సభలు, సమావేశాలతో ప్రజలు గుమిగూడటం మూడో ఉద్ధృతికి దారి తీయొచ్చని తెలిపారు. ఇటీవల టూరిస్ట్ లు పెరిగిన మనాలి, డార్జిలింగ్‌ ప్రాంతాల్లో కొవిడ్‌ కేసులు పెరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రాలు ఆంక్షలను పాటించకపోతే, మూడో ఉద్ధృతి ఆటోమేటిక్‌గా పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.


భారత్‌లో మూడో వేవ్‌లో కొన్ని ప్రాంతాల్లో రోజువారీ కేసులు 103శాతం వరకూ ఉండొచ్చనే అంచనా వేశారు. ఇక కొవిడ్‌ ఆంక్షల్ని పూర్తిగా ఎత్తేసినా,  పర్యాటకుల తాకిడి లేకపోతే మూడో ఉద్ధృతి తీవ్రత కొంతమేర తగ్గుతుందని తెలిపారు. ఆంక్షల ఎత్తివేతతో పాటు సెలవు రోజుల్లో పర్యాటకుల సంఖ్య పెరిగితే మాత్రం మహమ్మారి వ్యాప్తి ఎక్కువగా ఉంటుందన్నారు.

 
సోషల్ డిస్టెన్స్‌ పాటించకపోతే కరోనా వంటి శ్వాసకోశ సంబంధ రోగాలు విస్తృతంగా వ్యాపించే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు. హోటళ్లు, కేఫ్‌లలో కూర్చొని ఎక్కువసేపు మాట్లాడుకోవడం.. షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం వంటి పనులతో కరోనా ముప్పు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.


పర్యాటకులు పెరిగి స్థానిక వ్యాపారులకు లబ్ధి చేకూరుతుంది కానీ... టూరిస్ట్‌లు, స్థానికులు, అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. కరోనా వ్యాప్తి పెరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని... అప్పుడే అందరి సంక్షేమాన్ని కాపాడుకుంటూ ముందడుగు వేయడం సాధ్యమవుతుందన్నారు.

 
దేశానికి మూడో ఉద్ధృతి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ సూచించారు. కోవిడ్ అంశంపై తమ నిపుణులు పేర్కొన్న గణాంకాలు  ఇప్పటివరకు తప్పలేదని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రస్తుత పండగల సీజన్‌లో అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కనీసం మరో 6-8 వారాల పాటు బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే, మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశముందని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments