Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో 200 రోజుల కనిష్ఠానికి క‌రోనా క్రియాశీల కేసులు

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (12:21 IST)
దేశంలో కరోనా కేసుల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా 20వేలకుపైనే కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే అంతక్రితం రోజు(22,842)తో పోల్చితే, తాజా కేసులు స్వల్పంగా తగ్గాయి. ఇక మరణాలు 200లోపే చోటుచేసుకోవడం ఊరట కలిగిస్తోంది.
 
గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 కేసులు నమోదయ్యాయి. నిన్న 180 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,48,997కి చేరింది. ఇక కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కవగా నమోదవుతుండటం సానుకూలాంశం. నిన్న ఒక్క రోజే 26,718 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనాను జయించిన వారి సంఖ్య 3.31 కోట్లకు చేరింది.
 
రీకవరీలు ఎక్కువగా ఉండటంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 200 రోజుల కనిష్ఠానికి చేరి 2,64,458(0.78%)గా ఉంది. ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకూ 90.79 కోట్ల డోసులను కేంద్రం పంపిణీ చేసింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments