Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివుడు కోరాడనీ పురుషాంగాన్ని త్యాగం చేసిన ఖైదీ... ఎక్కడ?

Webdunia
బుధవారం, 6 మే 2020 (16:33 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌లో ఓ ఖైదీ వింతగా ప్రవర్తించాడు. దేవుడు కలలో కనిపించాడనీ, ఆయన చెప్పిన పిదట తన పురుషాంగాన్ని కత్తిరించి కానుకగా సమర్పించినట్టు వెల్లడించాడు. ఆ ఖైదీ చెప్పిన మాటలు విని జైలు అధికారులు నిర్ఘాంతపోయారు. ఆ తర్వాత చావు బతుకుల మధ్య ఆ ఖైదీని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, వివిధ నేరాల కింద అరెస్టు అయి జైలుశిక్ష పడిన విష్ణు సింగ్ రావత్ అనే ఖైదీని గ్వాలియ‌ర్ జైలుకు తరలించాడు. దీంతో అక్కడ కొన్నేళ్లుగా శిక్షను అనుభవిస్తున్నాడు. అయితే, ఈయనకు దైవభక్తి ఎక్కువ. ఈ క్రమంలో మంగళవారం రాత్రి తీవ్ర రక్తస్రావంతో కనిపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన జైలు వార్డెన్లు... సమాచారాన్ని జైలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆ ఖైద వద్ద విచారణ జరుపగా, రాత్రి త‌న‌కు క‌ల‌లో శివుడు ప్ర‌త్య‌క్ష‌మై, త‌న పురుషాంగాన్ని త్యాగం చేయాల్సిందిగా కోరాడ‌ని, అందుకే ఈ ప‌ని చేశాన‌ని తెలిపాడు. చెంచాను ప‌దునుగా మార్చి దానితోనే మ‌ర్మాంగాన్ని క‌త్తిరించి శివ‌లింగం వ‌ద్ద ఉంచిన‌ట్లు పేర్కొన్నాడు. పైగా, ఇలా చేసినందుకు తానేమీ చింతించడం లేదని చెప్పారు. 
 
ఆ తర్వాత జైలు సూప‌రింటెండెంట్ మ‌నోజ్ సాహు మాట్లాడుతూ.. 'ఉద‌యం ఆరున్న‌ర ప్రాంతంలో ఖైదీ విష్ణు సింగ్ ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉండ‌టాన్ని గ‌మ‌నించాం. వెంట‌నే అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించాం. ప్ర‌స్థుతం అత‌డి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది" అని తెలిపాడు. మ‌రోవైపు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments