Webdunia - Bharat's app for daily news and videos

Install App

శృంగారానికి మైనర్ బాలిక సమ్మతించినా అది అత్యాచారం లెక్కే : ఢిల్లీ హైకోర్టు

Webdunia
మంగళవారం, 6 డిశెంబరు 2022 (11:47 IST)
మైనారిటీ తీరని బాలిక పూర్తి సమ్మతంతో సెక్స్‌కు అంగీకరించినా చట్ట ప్రకారం అది అత్యాచారం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. ఓ అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 
 
మైనర్‌కు కీలక నిర్ణయాలు తీసుకునే మానసిక పరిణితి ఉండదని, అందుకే మైనర్ ఇష్టప్రకారం, పూర్తి సమ్మతంతో శృంగారానికి సమ్మతించినప్పటికీ దాన్ని అత్యాచారం కిందనే పరిగణిస్తామని జస్టిస్ జస్మీస్ సింగ్ వెల్లడించారు. 
 
ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 16 యేళ్ల అమ్మాయి గత 2019లో ఇంటి నుంచి వెళ్లిపోయి 23 యేళ్ల యువకుడితో కలిసి ఉంటుంది. సుమారు ఒకటిన్నర నెల పాటు అతనితోనే కలిసివున్నది. అయితే, ఆ యువకుడికి అప్పటికే పెళ్లయింది కూడా. 
 
ఈ నేపథ్యంలో తన కుమార్తె కనిపించడం లేదంటూ బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు బాలికతో పాటు యువకుడుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. 
 
బాలిక మైనర్ కావడంతో ఆ యువకుడిపై కిడ్నాప్, అత్యాచారం ఆరోపణల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైల్లోనే ఉంటున్న ఆ వ్యక్తి బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఇద్దరూ కలిసివుంటున్నారని నిందితుడి తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. 
 
అయితే, మైనర్ తెలిపే అంగీకారం ఆమోదయోగ్యం కాదంటూ జడ్జి వ్యాఖ్యానించారు. పైగా బాలిక ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చి ఆ బాలిక మైనర్ కాదని చూపించేందుకు నిందితుడు ప్రయత్నించాడని న్యాయమూర్తి గుర్తుచేశారు. తప్పుడు మార్పులు చేయడం తీవ్రమైన నేరమని, అందువల్ల నిందితుడికి బెయిల్ ఇవ్వలేమని కోర్టు స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం