Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కాంగ్రెస్ పాదయాత్ర

Webdunia
ఆదివారం, 15 మే 2022 (13:54 IST)
కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాద యాత్రలు, జనతా దర్బార్ (ప్రజా సమావేశాలు) నిర్వహించడం ద్వారా తిరిగి పెద్ద సంఖ్యలో ప్రజల మనసులను చేరుకోవాలని యోచిస్తోంది. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 
 
నిరుద్యోగ అంశాన్ని ప్రధానంగా కాంగ్రెస్ ప్రస్తావించనుంది. ఉయయ్ పూర్ లోని పార్టీ చింతన్ శిబిరంలో భాగంగా ఇందుకు సంబంధించి ‘జన జాగరణ్ అభియాన్‘ కార్యక్రమం చర్చకు వచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఒక వివరణాత్మక ప్రెజెంటేషన్ ఇచ్చినట్టు తెలిపాయి. దేశవ్యాప్తంగా ప్రజలకు కాంగ్రెస్ ను చేరువ చేేసేందుకు యూత్ కాంగ్రెస్ కూడా ఇటువంటి ప్రతిపాదనే చేసినట్టు పేర్కొన్నాయి. 
 
‘‘ఈ ప్రతిపాదన దాదాపుగా ఖాయమైనట్టే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఈ యాత్రను చేపడుతుంది. ప్రజలను నేరుగా కలుసుకునే లక్ష్యంలో భాగంగా జనతా దర్భార్ లను కూడా నిర్వహించాలన్న ప్రతిపాదన ఉంది’’అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments