Webdunia - Bharat's app for daily news and videos

Install App

భాగ్య నగరికి సోనియమ్మ... హైదరాబాద్‌లో గాంధీ ఐడియాలజీ సెంటర్

Webdunia
శుక్రవారం, 12 మే 2023 (08:48 IST)
కాంగ్రెస్ పూర్వ అధ్యక్షురాలు సోనియా గాంధీ హైదరాబాద్ నగరానికి రానున్నారు. భాగ్యనగరిలోని బోవెన్‌పల్లిలో నిర్మించే గాంధీ ఐడియాలజీ సెంటర్ భవన నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేస్తారు. ఈ భవన నిర్మాణానికి వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీకి పది ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఇపుడు అదేస్థలంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సెంటర్ నిర్మాణానికి కూడా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు కూడా అనుమతి ఇచ్చింది. 
 
ఆ స్థలంలో గాంధీ ఐడియాలజీ సెంటర్ భవన నిర్మాణానికి అనుమతి కోరుతూ పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి కంటోన్మెంట్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి బుధవారం అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో నిర్మాణ పనులను ప్రారంభించాలని పీసీసీ నిర్ణయించింది. ఈ భవనంలో గాంధీ భావజాలాన్ని తెలిపే లైబ్రరీతో పాటు పార్టీ సిద్ధాంతాలు, కార్యక్రమాలను వీక్షించేలా ఒక థియేటర్, గాంధీ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నగరానికి వచ్చినపుడు అక్కడ బస చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. 
 
అలాగే, ఏఐసీసీ అధ్యక్షుడికి ప్రత్యేక చాంబర్, పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేలా ఈ భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఈ భవన నిర్మాణ శంకుస్థాపనకు సోనియా గాంధీతో పాటు ఆమె తనయుడు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఇతర ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments