పవన్ కళ్యాణ్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ అప్డేట్ రాబోతుంది. రేపు సాయంత్రం 4.59 గంటలకు హైదరాబాద్ సంధ్య థియేటర్ లో అభిమానుల కోసం ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ విడుద చేస్తున్నారు. ఈ కార్య క్రమానికి చిత్ర దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ హాజరుకానున్నారు. ఆర్.టి.సి. క్రాస్ రోడ్స్ లోగల ఈ థియేటర్ పవన్ కళ్యాణ్ బనేర్ లు కట్టి సందడి చేస్తున్నారు.
ఉస్తాద్ భగత్ సింగ్ ఫీల్డ్‌లోకి ప్రవేశిస్తున్నాను, ఈసారి కేవలం వినోదం కంటే చాలా ఎక్కువ.. అంటూ కాప్షన్ తో పబ్లిసిటీ చేశారు. అది ఏమిటి అనేది రేపు వివరాలతో చెపుతామని దర్శకుడు హరీష్ శంకర్ తెలియ జేస్తున్నారు. పంకజ్ త్రిపాఠి తదితరులు నటిసున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు.