Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొణెదల నిహారిక కీలక పాత్రలో డెడ్ పిక్సెల్ రాబోతుంది

Advertiesment
Niharika, Viva Harsha, Akshay, Sai Ronak
, బుధవారం, 10 మే 2023 (18:47 IST)
Niharika, Viva Harsha, Akshay, Sai Ronak
ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం కొణెదల నిహారిక, వైవా హర్ష , సాయి రోనక్, అక్షయ్ ప్రధాన పాత్రల్లో నటించిన ''డెడ్ పిక్సెల్" వెబ్ సిరీస్ టీజర్ విడుదలై ఆకట్టుకుంది. ఈ నెల 19నుంచి స్ట్రీమింగ్ కాబోతోన్న ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. 
 
కొంతమంది కుర్రాళ్లు కలిసి బ్యాటిల్ ఆఫ్‌ థ్రోన్స్ అనే గేమ్ ను క్రియేట్ చేస్తారు. ఈ క్రమంలో ఆ గేమర్స్ ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటీ..? ఈ గేమ్ ఎలా ఉంటుంది..? ఆ గేమ్ వల్ల వారి లైఫ్‌లో వచ్చిన మార్పులేంటీ అనేది ప్రధాన ఇతివృత్తంగా ఈ సిరీస్ రాబోతోందీ. కంప్లీట్ గా నేటి యూత్ ను టార్గెట్ చేసుకుని రూపొందించిన సిరీస్ ఈ డెడ్ పిక్సెల్. 
 
ఇక యువతరం ఆలోచనల్లోని కన్ఫ్యూజన్స్, సరికొత్త టార్గెట్స్ పేరుతో వాళ్లు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ తో పాటు అనుకోకుండా ఆ గేమర్స్ అంతా ఓ ట్రాప్ లో చిక్కుకుంటారు. మరి ఆ ట్రాప్ వేసింది ఎవరు..? ఆ ట్రాప్ నుంచి వీళ్లు ఎలా బయటపడ్డారు అనేది తెలియాలంటే ఈ నెల 19నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతోన్న ఈ డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ చూడాల్సిందే.
 
తారాగణం : నిహారిక తో పాటు వైవా హర్ష, అక్షయ్,సాయి రోనక్, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓడి గెలిచినవాడి కథ భువన విజయమ్