Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాస్టీ బైక్‌పై చీఫ్ జస్టీస్ బాబ్డే - హార్లే డేవిడ్‌స‌న్ బైకుతో ట్రయల్ రన్

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (13:55 IST)
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అనేక కీలక తీర్పులు వెలువరించిన ఏస్ఏ బాబ్డేకు... బైక్ రైడింగ్ అంటే మహా ఇష్టం. అందుకే 64 యేళ్ళ బాబ్డే అత్యంత ఖరీదైన హార్లే డేవిడ్‌సన్ బైకును నడిపాడు. గత వారం వీకెండ్‌లో ఆయన నాగ్‌పూర్‌లో ఈ బైకుపై కూర్చొని ఫోటోలకు ఫోజులిచ్చారు. అవి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 
 
ప్ర‌స్తుతం లాక్డౌన్ వ‌ల్ల నాగ‌పూర్‌లోని త‌న సొంత ఇంట్లోనే బోబ్డే ఉంటున్నారు. 2019 న‌వంబ‌ర్‌లో భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా బోబ్డే బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఆ స‌మ‌యంలో ఇచ్చిన ప‌లు ఇంట‌ర్వ్యూల్లో ఆయ‌న త‌న‌కు బైక్‌ల‌పై ఉన్న మ‌క్కువను వెల్ల‌డించారు. 
 
ఓసారి బైక్ న‌డుపుతూ ప్ర‌మాదానికి గురికావ‌డ వ‌ల్ల .. కోర్టుకు హాజ‌రుకాలేక‌పోయిన‌ట్లు కూడా తెలిపారు. తాజాగా హార్లే డేవిడ్‌స‌న్ లిమిటెడ్ ఎడిష‌న్ సీవీవో 2020 మోడ‌ల్‌ను సీజే బోబ్డే ట్ర‌య‌ల్ రైడ్‌ చేశారు.  
 
లాక్డౌన్ స‌మ‌యంలో న్యాయ‌వాదులు న‌ల్ల కోట్లు వేసుకోరాదని, తెల్ల‌టి ష‌ర్ట్‌లు ధ‌రించి, దానిపై బ్లాక్ నెక్ బ్యాండ్ వేసుకుంటే స‌రిపోతుంద‌ని అన్నారు. ఇటీవ‌ల తీర్పుల‌న్నీ వీడియో కాన్ఫ‌రెన్స్‌లోనే నిర్వ‌హిస్తున్నారాయ‌న‌. 
 
తాజాగా జ‌గ‌న్నాథ ర‌థ‌యాత్రపైన కూడా ఆయ‌న తీర్పునిచ్చారు. యాత్ర‌కు అనుమ‌తిస్తే, జ‌గ‌న్నాథుడు మమ్ముల్ని క్ష‌మించ‌డ‌ని బోబ్డే తీర్పునిచ్చారు. 
 
అయితే హార్లే డేవిడ్‌స‌న్ సూప‌ర్‌బైక్ పై బోబ్డే.. మాస్క్ లేకుండా ఉండ‌డాన్ని కొంద‌రు నెటిజ‌న్స్ త‌ప్పుప‌ట్టారు. సీజే కొత్త అవ‌తారం బాగున్నా.. లాక్‌డౌన్ నియ‌మావ‌ళి ఉల్లంఘించిన‌ట్లు ఉంద‌ని కొంద‌ర‌న్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సెల్ ఫోన్లు రెండూ ఇంట్లో వదిలేసి రాంగోపాల్ వర్మ పరార్? ఇంటి ముందు పోలీసులు

ఆ ఫ్యామిలీస్ కీ వేరే లెవెల్ ఆఫీస్ వెబ్ సిరీస్ కనెక్ట్ అవుతుంది : డైరెక్టర్ ఇ సత్తిబాబు

తన మాజీ భర్తకు ఇచ్చిన గిఫ్టులపై సమంత అలా కామెంట్స్ చేయడం భావ్యమేనా?

రోడ్డు ప్రమాదంలో చిక్కిన కాంతార టీమ్.. కొల్లూరులో బస్సు బోల్తా

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments