Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెళ్లికి వస్తున్నారా? గిఫ్ట్ కొంటున్నారా? ఐతే ఈ పని చేయండి..

Advertiesment
పెళ్లికి వస్తున్నారా? గిఫ్ట్ కొంటున్నారా? ఐతే ఈ పని చేయండి..
, శుక్రవారం, 4 అక్టోబరు 2019 (15:30 IST)
సాధారణంగా వివాహాల్లో కానుకలు ఇవ్వడం తప్పనిసరి. వివాహాలకు హాజరయ్యే బంధుమిత్రులు తమకు వీలైనంతలో కానుకలను కొత్త దంపతులకు అందజేస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్. పెళ్లికి హాజరయ్యే వారు తమకు అవసరమైన కానుకలివ్వాలని ఓ యువతి డిమాండ్ చేసింది.

తనకు కావలసిన వస్తువులను కొనుగోలు చేసి కానుకలుగా ఇవ్వడం లేదంటే.. దానికి బదులుగా డబ్బులు ఇచ్చేయాలని షరతు పెట్టింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన ఓ వధువు తనకు కావలసిన వస్తువులను ఓ లిస్టు వేసి మరీ ఆ జాబితాను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. 
 
ఈ లిస్టులో కిచెన్ వస్తువులు ఇవ్వదలిచితే.. 280 డాలర్లకు పైగా ఖర్చు అవుతుంది (భారత కరెన్సీ ప్రకారం 18వేల రూపాయలకు పైమాటే). అందుచేత కొనివ్వాలనుకునే వారు కిచెన్ సెట్‌నే కొనివ్వండి లేకుంటే డాలర్ల రూపేణా చెల్లించండి అంటూ కండిషన్ పెట్టింది. 
 
ఇంకా ఇంటికి టైల్స్ కూడా తనకు అవసరమని టైల్స్ తీసివ్వాలనుకునేవారు కొనిపెట్టవచ్చునని.. లేకుంటే 325 డాలర్ల మొత్తాన్నైనా కానుక రూపేణా ఇచ్చేయవచ్చునని చెప్పింది. అంతేగాకుండా ఓ లింక్‌ను కూడా ఈ జాబితా లిస్టులో పెట్టింది. 
 
తనకు ఇచ్చే కానుకల గురించి ఏదైనా వస్తువులను కొనుగోలు చేయాలనుకునేవారు తనకు ముందే చెప్పాలని కూడా వెల్లడించింది. ఈ లిస్టు కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. నెటిజన్లు తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలాకోట్‌ను రిపీట్ కానివ్వొద్దు : పాక్‌కు ఐఏఎఫ్ వార్నింగ్