విరాట్ కోహ్లీ రికార్డు గోవిందా.. స్మిత్ షాకిచ్చాడుగా..!

మంగళవారం, 10 సెప్టెంబరు 2019 (15:51 IST)
టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రికార్డు కొద్ది రోజులకే బ్రేక్ అయ్యింది. టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకును కైవసం చేసుకుని కొద్దిరోజులకే బ్రేక్ అయ్యింది. కోహ్లీని ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ వెనక్కి నెట్టేశాడు. తద్వారా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెన్ సీరిస్‌లో ఆసీస్ ఆటగాడు స్టీవెన్ స్మిత్ పరుగుల వరద పారిస్తున్నాడు. 
 
ఈ సీరిస్‌లో స్మీత్ ఇప్పటి వరకు 671 పరుగులు సాధించాడు. సుమారు 135 సగటుతో నిలిచాడు. ఇలా పరుగుల వరదతో స్మిత్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. ప్రపంచ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మూడు టెస్ట్ మ్యాచ్‌లు లేదా అంతకు మించిన మ్యాచ్‌ల సీరిస్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్‌ మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
 
ఇక ఈ క్రమంలోనే స్మిత్ కోహ్లీతో పాటు పాక్ మాజీ ఆటగాడు మహ్మద్ యూసఫ్ రికార్డుకు సైతం బ్రేక్ చేశాడు. 2006-07 సీజన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మూడు టెస్టు సిరీస్‌లో యూసఫ్‌ 665 పరుగులు సాధించాడు. ఇక 2017-18 సీజన్‌లో భాగంగా శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో కోహ్లి 610 పరుగులు నమోదు చేశాడు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం శ్రీలంక క్రికెటర్ల డుమ్మా... పాకిస్థాన్ టూర్‌ వద్దనే వద్దట