Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (20:11 IST)
పౌరసత్వ చట్ట సవరణ బిల్లును బుధవారం రాజ్యసభ ముందుకు తీసుకురానుంది ప్రభుత్వం. ఇప్పటికే లోక్​సభలో నెగ్గిన బిల్లును.. అన్నాడీఎంకే, వైకాపా, తెదేపా, బీజేడీ వంటీ పార్టీల మద్దతు కూడగట్టి రాజ్యసభలోనూ ఆమోదింపజేసుకోవాలని అధికార పార్టీ భావిస్తోంది. ఆమోదంపై ధీమా వ్యక్తం చేస్తోంది.

వివాదాస్పద పౌరసత్వ చట్ట సవరణ బిల్లు-2019ను బుధవారం రాజ్యసభలో ప్రవేశపట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇతర పార్టీల మద్దతుతో బిల్లును ఆమోదింపచేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోంది అధికార భాజపా. పార్లమెంట్​ దిగువసభలో అధికార పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నందున సోమవారం సుదీర్ఘ చర్చ అనంతరం పౌరసత్వ బిల్లు ఆమోదం పొందింది.

ఎన్డీఏకి మద్దతుగా ఇతర పార్టీలు నిలుస్తున్న కారణంగా రాజ్యసభలోనూ ఈ బిల్లు నెగ్గుతుందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో 238 మంది సభ్యులు ఉన్నారు. ఎన్డీఏకి 105 మంది బలం ఉంది. అందులో భాజపా 83, జనతాదళ్​(యూ) 6, శిరోమణి అకాలి దళ్​ 3, ఎల్​జేపీ, ఆర్​పీఐ(ఏ)కు తలాఒకటి, 11 మంది నామినేటేడ్​ ఎంపీలు ఉన్నారు.

మొత్తం 127 మంది సభ్యుల మద్దతు! బిల్లును ఎలాగైనా గట్టెక్కించాలనే లక్ష్యంతో ఉంది భాజపా. ఇప్పటికే అన్నాడీఎంకే(11), బీజేడీ(7), వైకాపా(2), తేదేపా(2)తో చర్చలు చేపట్టింది. బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరింది. ఈ పార్టీలన్నీ లోక్​సభలో బిల్లుకు మద్దతుగా నిలిచిన కారణంగా రాజ్యసభలోనూ అండగా నిలుస్తాయనే విశ్వాసంతో ఉంది భాజపా.

ఈ నాలుగు పార్టీల మద్దతుతో భాజపా నేతృత్వంలోని ఎన్డీఏకి 127 మంది సభ్యుల బలం ఉంటుంది. ఇది సాధారణ మెజారిటీ 120 కన్నా ఎక్కువ. కాబట్టి బిల్లు రాజ్యసభలోనూ నెగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం