Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ సదుపాయం.. వెనుకబడిన జియో

Webdunia
మంగళవారం, 10 డిశెంబరు 2019 (19:50 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా రిలయన్స్ జియో నుంచి ఎయిర్‌టెల్‌తో పాటు ఇతర ప్రైవేట్ టెలికాం కంపెనీలకు గట్టి పోటీ నెలకొంది. దాంతో పాటు కాల్ డ్రాప్ సమస్య ఎక్కువవడం, తనకు రిలయన్స్ జియో నుంచి గట్టి పోటీ ఎదురవుతుండడం వంటి పరిణామాల నేపథ్యంలో దిగ్గజ మొబైల్ ఆపరేటర్ ఎయిర్ టెల్ 'వాయిస్ ఓవర్ వైఫై' టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది. దీన్నే 'వీఓ వై-ఫై' అని పిలుస్తారు. 
 
సాధారణంగా మొబైల్‌లో కాల్స్ చేసుకోవాలంటే సిమ్ కార్డు సిగ్నల్ ఉండాలి. కానీ సెల్‌నెట్ వర్క్ లేకపోయినా కాల్స్ చేసుకునే సదుపాయాన్నే 'వీఓ వై-ఫై' కాలింగ్ అంటారు. ఈ విధానంలో అందుబాటులో ఉన్న వై-ఫై నెట్ వర్క్‌ను ఉపయోగించుకుని మొబైల్ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు. ఒక రకంగా ఇది ఇంటర్నెట్ ఫోన్ కాల్ వంటిదే. 
 
ఇంటర్నెట్ ఫోన్ కాల్‌లో పీసీ, ల్యాప్ ట్యాప్‌ను ఉపయోగిస్తారు. వై-ఫై కాలింగ్‌లో మొబైల్‌ను ఉపయోగిస్తారు. అంతే తేడా. కొన్నిసార్లు ఇంట్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ అందుబాటులో వుండవు. అంతేకాదు, వాయిస్ మధ్యలోనే కట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నింటికీ 'వాయిస్ ఓవర్ వై-ఫై కాలింగ్'తో పరిష్కారం లభించనుంది. 
 
పైగా, అద్భుతమైన శబ్దనాణ్యత సాధ్యమవుతుందని ఎయిర్ టెల్ చెబుతోంది. 'వీఓ ఎల్టీఈ' పేరుతో తీసుకువచ్చినా, అది సిమ్ కార్డుతో మాత్రమే సాధ్యమవుతుంది. ఖచ్చితంగా మొబైల్ నెట్ వర్క్ కవరేజీ ఉండాల్సిందే. 
 
ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ఎలా పనిచేస్తుందంటే? 
దీనికి ఎలాంటి యాప్ అవసరం లేదు. మీ స్మార్ట్ ఫోన్ వైఫై కాలింగ్‌కు అనువైనదేనా అని పరిశీలించాలి. లేదా, మీ డివైస్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌ను వై-ఫై కాలింగ్‌కు అనుకూలమైన లేటెస్ట్ వెర్షన్‌కు మార్చుకోవాలి. ఆపై సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'వై-ఫై కాలింగ్'ను ఎనేబుల్ చేయాలి. దీనికి ఎయిర్ టెల్ ఎలాంటి చార్జీ వసూలు చేయడంలేదు. ఇదో సాంకేతిక సదుపాయం మాత్రమే. ఈ ఫీచర్ ఆన్‌లో ఉన్నప్పుడు మొబైల్ నెట్ వర్క్ కవరేజి తగ్గిపోతే వెంటనే 'వై-ఫై కాలింగ్' ప్రారంభమవుతుంది.
 
ఏ ఫోన్లు 'వై-ఫై కాలింగ్'కు అనుకూలం? 
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫోన్లలో షామీ తయారీ రెడ్ మీ కె20, రెడ్ మీ కె20 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ జె6, గెలాక్సీ ఎ10ఎస్, గెలాక్సీ ఓఎన్6, గెలాక్సీ ఎం30ఎస్, వన్ ప్లస్ సిరీస్‌లో 7, 7 ప్రొ, 7టి, 7టి ప్రొ ఫోన్లు ఈ వైఫై కాలింగ్‌ను సపోర్ట్ చేస్తున్నాయి. ఐఫోన్ 6ఎస్ నుంచి అన్ని ఐఫోన్లు ఈ టెక్నాలజీని కలిగివున్నాయి.
 
ఇది ఎలా పనిచేస్తుంది? 
ఎయిర్‌టెల్ వైఫై కాలింగ్ ప్రస్తుతానికి 'ఎయిర్ టెల్ ఎక్స్ ట్రీమ్ ఫైబర్ హోమ్ బ్రాడ్ బ్యాండ్' కనెక్షన్ ఉన్న వినియోగదారులకే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే అన్ని బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు, దేశంలోని అన్ని వైఫై హాట్ స్పాట్లు ఉపయోగించుకుని ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ చేసుకునే సౌలభ్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్ టెల్ చెబుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

NTR; అర్జున్ S/O వైజయంతి సినిమా ప్రీ రిలీజ్ కి తమ్ముడు వస్తాడు : కళ్యాణ్ రామ్

Raviteja: తు మేరా లవర్ అంటూ రవితేజ మాస్ జాతర సాంగ్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments