Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేవలం మూడు వేలకు కన్నతండ్రే కూతుర్ని అమ్మేశాడు.. గర్భవతి కావడంతో..?

Webdunia
బుధవారం, 30 సెప్టెంబరు 2020 (12:49 IST)
కన్నతండ్రే కూతుర్ని అమ్మేశాడు. అది కూడా అక్షరాల మూడు వేల రూపాయలకు. ఈ ఘటన రెండేళ్ల క్రితం చోటుచేసుకోగా ఇప్పుడు వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌ఘడ్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన కుమార్తెను రెండేళ్ల క్రితం 21 ఏళ్ల యువకుడికి రూ. 3 వేలకు అమ్మేశాడు. అప్పుడామె వయసు 16 సంవత్సరాలు. ఇంట్లో పని చేయించుకునేందుకని చెప్పి ఆ బాలికను యువకుడు తీసుకెళ్లాడు.
 
కానీ ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేసి హింసించాడు. ఈ క్రమంలో బాధితురాలు కొన్ని నెలల క్రితం గర్భం ధరించింది. దీంతో ఆ యువకుడు.. ఆమెను నడిరోడ్డుపై వదిలేశాడు. ఆమెతో డబ్బు లేకపోవడంతో వీధుల్లో తిరుగుతూ జీవనం సాగించింది. కో
 
విడ్ వ్యాప్తి నేపథ్యంలో ఆమెను ఎవరూ ఆదుకోలేదు. మొత్తానికి ఈ ఏడాది మే నెలలో బాధితురాలిని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు చేరదీశారు. ఆ తర్వాత ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. నెల రోజుల క్రితం ఆమెను బిలాస్‌పూర్‌లోని సఖి కేంద్రానికి తరలించారు.
 
తనకు జరిగిన ఘోర అవమానాన్ని సఖి కేంద్ర నిర్వాహకులకు బాధితురాలు చెప్పింది. రెండేళ్ల క్రితం తన అమ్మ చనిపోయినప్పుడు.. తనను ఓ యువకుడికి మూడువేలకు కన్నతండ్రి అమ్మేశాడని చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్‌ పదవికి రత్నం పేరును ప్రతిపాదించా : పవన్ కళ్యాణ్

Ram charan: రామ్ చరణ్ గడ్డం, వెనుకకు లాగిన జుట్టు జిమ్ బాడీతో పెద్ది కోసం సిద్ధం

అన్నం పెట్టిన సినీ పరిశ్రమకు, నిర్మాతకు అండగా వుండేదుకే వచ్చా : పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించే అవకాశం దక్కటం నా అదృష్టం.. నిధి అగర్వాల్

నేను యాక్సిడెంటల్ హీరోను... చిరంజీవి తమ్ముడైనా టాలెంట్ లేకుంటే వేస్ట్ : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం