Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దెయ్యం పట్టిందని బాబా దగ్గరకు తీసుకెళ్లే... కొట్టి పైలోకానికి పంపాడు...

Advertiesment
దెయ్యం పట్టిందని బాబా దగ్గరకు తీసుకెళ్లే... కొట్టి పైలోకానికి పంపాడు...
, బుధవారం, 30 సెప్టెంబరు 2020 (12:04 IST)
కర్నాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో విషాదకర ఘటన ఒకటి చోటుచేసుకుంది. మూడేళ్ళ బాలికకు దెయ్యం పట్టిందని బాబా దగ్గరకు తీసుకెళ్తగా.. దెయ్యం వదిలించేందుకు బాబా కొట్టిన దెబ్బలు ఆ చిన్నారి భరించలేక ప్రాణాలు కోల్పోయింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్రదుర్గ జిల్లాలోని అజ్జిక్యాతాన్హల్లి గ్రామ శివారులో రాకేశ్ (19), పురుషోత్తం(21) అనే వ్యక్తులు దెయ్యలు వదలగొడుతామని బాబాల వేషం వేస్తూ పూటగడుపుతున్నారు. ఎవరికైనా కలలు, పిచ్చిగా మాట్లాడితే మంత్రాలు జపించి దెయ్యాలను వదలగొడుతామని స్థానిక ప్రజలకు నమ్మకం కలిగించారు. 
 
ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి మూడేళ్ల కుమార్తె ఉంది. ఈ పాప ప్రతి రోజు రాత్రి కలవరిస్తూ.. నిద్రలో లేచి ఏడుస్తూ ఉండడంతో  రాకేశ్ అనే బాబాకు వద్దకు తండ్రి తీసుకొచ్చాడు. రాకేష్ బాబా ఆ బాలికను గంటకు పైగా బాదడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. గంట తర్వాత బాలిక అపస్మారకస్థితిలో నుంచి బయటకు వస్తుందని నమ్మబలికారు. 
 
బాలిక గంట తర్వాత స్పృహలోకి రాకపోవడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలిక చనిపోయిందని తెలిపారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు చిక్కజాజూర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయడంతో తప్పించుకున్న ఇద్దరు బాబాలను ఘటనా స్థలం నుంచి 300 కిలో మీటర్ల దూరంలో అరెస్టు చేశారు. వీరిపై ఐపిసి 302 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అర్థరాత్రి అంత్యక్రియలు : కడచూపుకు నోచుకోని హత్రాస్ అత్యాచార బాధితురాలు!