Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 28 March 2025
webdunia

మా పెళ్లై ఏడాదవుతుంది, సంతానభాగ్యం ఎప్పుడు?

Advertiesment
మా పెళ్లై ఏడాదవుతుంది, సంతానభాగ్యం ఎప్పుడు?
, మంగళవారం, 15 సెప్టెంబరు 2020 (12:46 IST)
అనురాధగారూ... మీరు దశమి మంగళవారం, మీన లగ్నం, మఖ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. సంతాన దోషం వుంది. నాలగవ ఇంట కేతువు, పదవ ఇంట రాహువు వుండటం వల్ల గ్రహబంధన దోషం ఏర్పడింది. సంతాన దోషానికి పుత్రకామిష్టి, సంతాన వేణుగోపాల స్వామి వ్రతం చేయించినా శుభం కలుగుతుంది. 
 
సంతాన కారకుడైన గురువు అష్టమము నందు ఉండటం వల్ల సంతానం ఆలస్యం అవుతుంది. 2021 నందు సంతాన యోగం కలదు. ప్రయత్నం చేయండి. సుబ్రహ్మణ్యస్వామికి 9 మంగళవారాలు ఆవుపాలతో అభిషేకం చేయించిన సంతాన ప్రాప్తి కలుగుతుంది.
 
మీ సందేహాలను editor_telugu@webdunia.net కి తెలుపగలరు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంగళవారం కుబేర స్థానాన్ని చూస్తూ నిద్రలేస్తే..? (video)