Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛత్తీ‌స్‌గఢ్ హార్రర్ : మహిళను దగ్గరుండి గ్యాంగ్ రేప్ చేయించిన పోలీస్...

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2020 (16:33 IST)
అత్యాచారాలపై ఎన్ని చట్టాలు చేసినప్పటికీ మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో తాజాగా మరో దారుణం జరిగింది. ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ కామాంధుల ముఠాలో ఓ పోలీస్ కూడా ఉండటం గమనార్హం. ఈ కేసులో పోలీస్ దగ్గరుండి గ్యాంగ్ రేప్ చేయించాడు. ఈ దారుణానికి పాల్పడిన కామాంధుల్లో ఒక ఉపాధ్యాయుడు, ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాయ్‌పూర్‌కు చెందిన ఓ మహిళపై పోలీస్, ప్రభుత్వ అధికారి, ఒక ఉపాధ్యాయుడు కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ మహిళపై అత్యాచారం చేయడమేకాకుండా ఆ సమయంలో వీడియో తీసి మహిళపై బెదిరింపులు చేశారు. 
 
ఈ విషయం బయటికి చెబితే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అంతటితో ఆగకుండా బాధితురాలి కూతురిపై కూడా అత్యాచారం చేస్తామని బెదిరించారు. దీంతో దిక్కుతోచని స్థితిలో దు:ఖాన్ని గొంతులోనే బిగపట్టుకుని ఉంది బాధితురాలు. 
 
ఆ తర్వాత నుంచి ఆ కామాంధుల ఆగడాలు హెచ్చుమీరిపోయాయి. ప్రతి రోజూ ఆ మహిళను వేధించసాగారు. దీంతో వేధింపులు భరించలేని ఆ బాధితురాలు నాలుగు నెలల తర్వాత పోలీస్ స్టేషన్ గడపతొక్కి, తనకు జరిగిన అన్యాయాన్ని బోరున విలపిస్తూ చెప్పింది. బాధితురాలు ఇచ్చిన లిఖిత ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: హీరోయిన్లను అలా చూపించేందుకు దర్శకులు ఇష్టపడతారు

Anushka: ఘాటి చిత్ర విజయంపై అనుష్క శెట్టి కెరీర్ ఆధారపడి వుందా?

శివరాజ్ కుమార్ చిత్రం వీర చంద్రహాస తెలుగులో తెస్తున్న ఎమ్‌వీ రాధాకృష్ణ

Dhanush: కుబేర ఫస్ట్ సింగిల్ పోయిరా మామా..లో స్టెప్ లు అదరగొట్టిన ధనుష్

మలేషియాలో చిత్రీకరించబడిన విజయ్ సేతుపతి ACE చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం