Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోషా మహల్ పోలీసు స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం

Advertiesment
గోషా మహల్ పోలీసు స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం
, శుక్రవారం, 6 మార్చి 2020 (09:37 IST)
గోషా మహల్ పోలీసు స్టేడియంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. విషయం గమనించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు. క్షణాల్లో ఘటనా స్థలానికి చేరుకున్న మూడు ఫైరింజన్లు, అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. 
 
ఈ ప్రమాదంలో స్టేడియంలో పలు కేసుల్లో రికవరీ చేసిన వాహనాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.  పెండింగ్లో ఉన్న కేసులకు సంబంధించిన వాహనాలను పలు పోలీస్ స్టేషన్ల నుండి గోషామహల్ స్టేడియంలో భద్రపరుస్తారు. ఈ ప్రమాదంలోఆయా వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. కాలిపోయిన వాహనాలన్నీ ప్రస్తుతం స్క్రాప్ గా మారాయని పోలీస్ అధికారులు చెప్తున్నారు. అగ్ని ప్రమాదం సంభవించింది ఆరా తీస్తున్నారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా ఎఫెక్ట్.. మోడీ బెల్జియం పర్యటన రద్దు