క్రమశిక్షణ పేరుతో రెండో తరగతి విద్యార్థినితో.. 100 గుంజీలు తీయించిన టీచర్‌

ఠాగూర్
ఆదివారం, 7 సెప్టెంబరు 2025 (16:17 IST)
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఒక టీచర్ అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. క్రమశిక్షణ పేరుతో  రెండో తరగతి విద్యార్థినితో ఏకంగా వంద గుంజీలు తీయించింది. దీంతో ఆ చిన్నారి తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 
 
స్థానిక పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ప్రతాప్‌గఢ్‌లోని ఓ పాఠశాలలో అడగకుండా టాయిలెట్‌కు వెళ్లిందనే కారణంతో బుధవారం ఎనిమిదేళ్ల బాలికతో ఉపాధ్యాయురాలు నమ్రతా గుప్తా బలవంతంగా 100 గుంజీలు తీయించింది. అనంతరం చిన్నారిని కర్రతో కొట్టింది. బాలిక తీవ్ర అస్వస్థతకు గురవ్వడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. 
 
చిరు ప్రాయంలో ఎక్కువ మొత్తంలో గుంజీలు తీయడంతో బాలిక కాళ్లలో కండరాలు దెబ్బతిన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థిని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. టీచర్‌ గుంజీలు తీయించడం వల్ల ప్రస్తుతం తమ చిన్నారి నడవలేకపోతోందని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ విషయం జిల్లా విద్యాశాఖ దృష్టికి వెళ్లడంతో ఘటనపై దర్యాప్తునకు ఓ బృందాన్ని ఏర్పాటుచేసింది. అయితే బాలికతో గుంజీలు తీయించిన ఉపాధ్యాయురాలు ఆమె చదువుతున్న తరగతికి ఎలాంటి క్లాసులు చెప్పరని దర్యాప్తులో తేలింది. సదరు ఉపాధ్యాయురాలిని తక్షణమే సస్పెండ్‌ చేశామని, పాఠశాల ప్రిన్సిపల్‌ రాజీవ్ సింగ్‌ను సెలవులపై పంపామని అధికారులు పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కౌబాయ్ చిత్రంలో నటిస్తానని ఊహించలేదు : చిరంజీవి

కొదమసింహం.. నాకు, రామ్ చరణ్ కు ఫేవరేట్ మూవీ - మెగాస్టార్ చిరంజీవి

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments